వేసే గడువు ముగిసె..! | Frenzy has expired ..! | Sakshi
Sakshi News home page

వేసే గడువు ముగిసె..!

Published Sat, Dec 31 2016 3:13 AM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM

వేసే గడువు ముగిసె..! - Sakshi

వేసే గడువు ముగిసె..!

జిల్లాలో రూ.600 కోట్లు డిపాజిట్‌ 
తీరని కరెన్సీ, చిల్లర కష్టాలు


ఏళ్ల పోరాటాలు ఫలించాయి.. కొత్త జిల్లా కల నెరవేరింది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా పేరును సొంతం చేసుకుంది.. సిరులు కురిపించే సింగరేణి బొగ్గు గనులు.. సహజ వనరులు.. ముఖ్యమైన పరిశ్రమలు, దట్టమైన అడవులు జిల్లా పరిధిలోకి చేరాయి. చిన్న జిల్లాల ఏర్పాటుతోనే అభివృద్ధి త్వరితగతిన సాధ్యమన్న సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు జిల్లా కలెక్టర్‌ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు.  ఆ మేరకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

జిల్లాలోని ఐదు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు చైర్మన్‌లను ప్రకటించారు. భద్రాద్రి ఆలయ ట్రస్టు బోర్డును ఇంకా నియమించలేదు. సింగరేణి ఆవిర్భావోత్సవాలను కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో పలు నామినేటెడ్‌ పదవుల్లో జిల్లా నేతలకు అవకాశం దక్కకపోవడంతో కొంత నిరాశలో ఉన్నారు.     – సాక్షి కొత్తగూడెం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement