హైదరాబాద్: మల్కాజ్గిరిలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మైకంలో ఓ వ్యక్తి తన స్నేహితుడిని హత్య చేశాడు. ప్రేమ్ విజయ్ నగర్ కాలనీలో సామ్యూల్(30) అనే వ్యక్తి మరో వ్యక్తి నివాసం ఉంటున్నారు. వీరద్దరికి తాగిన మత్తులో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పరస్పరం దాడి చేసుకోగా సామ్యూల్ చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.