సాక్షి, హైదరాబాద్: మొక్కుబడిగా సాగుతున్న ఐటీఐ కాలేజీలను బలోపేతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం యువతను పరిశ్రమలకు అవసరమైన రీతిలో తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఐటీఐ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొం దిస్తోంది. అందుకనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి, సంబంధిత కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు మొదటి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పది కాలేజీలను ఎంపిక చేసి నైపుణ్య తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకవసరమయ్యే యంత్ర సామగ్రి, సౌకర్యాల కోసం ప్రైవేటు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విడతల వారీగా మొత్తం 60 కాలేజీల్లో ఇదే విధానాన్ని తేవాలని భావిస్తోంది.
కాలేజీలకు పరిశ్రమల తోడ్పాటు
ప్రభుత్వ సూచన మేరకు ఐటీఐ కాలేజీల్లో యంత్ర సామగ్రిని అందించేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. మారుతీ సుజుకీ, హ్యుండాయ్, ఫోర్డు కంపెనీలు పలు కాలేజీలతో ఎంవోయూ కుదుర్చుకొని డబ్బులు అందజేశాయి. మారుతీ సుజుకీ 3 కాలేజీలతో ఒప్పందం చేసుకొని రూ.36 లక్షలు ఇచ్చింది. అలాగే హ్యుండాయ్ కంపెనీ రెండు కాలేజీలు, ఫోర్డు ఒక కాలేజీతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. శిక్షణ అనంతరం తమ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చాయి.
కళాశాల నుంచి ఉద్యోగానికి!
Published Sun, Nov 29 2015 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM
Advertisement