
నిమజ్జనానికి సిద్ధమైన గణపతి
శివ్వంపేట: మండల కేంద్రమైన శివ్వంపేటతో పాటు పలు గ్రామాల్లో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు బుధవారం కన్నులపండువగా నిర్వహించారు. శివ్వంపేటలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయకులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో నిమజ్జనానికి తరలించారు. బ్యాండ్ మేళాలతో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు.