'సిద్ధిపేట నుంచే టీఆర్ఎస్ పతనం' | geetha reddy takes on TRS Govt | Sakshi
Sakshi News home page

'సిద్ధిపేట నుంచే టీఆర్ఎస్ పతనం'

Published Tue, Apr 12 2016 6:34 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

'సిద్ధిపేట నుంచే టీఆర్ఎస్ పతనం'

'సిద్ధిపేట నుంచే టీఆర్ఎస్ పతనం'

హైదరాబాద్: టీఆర్ఎస్ పతనం కేసీఆర్ స్వస్థలం సిద్ధిపేట నుంచే మొదలైందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు జె. గీతారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... సిద్ధిపేట మున్సిపాలిటీలోని 34 వార్డులను ఏకగ్రీవంగా కైవశం చేసుకోవాలనుకున్న టీఆర్ఎస్ కు భంగపాటు తప్పలేదని తెలిపారు. సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 28 డివిజన్లలో పోటీ 12 వార్డులు గెలిచారని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏవీ అమలుకావని అన్నారు.

సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో 28 వార్డులను (ఆరుగురు రెబల్ అభ్యర్థులతో కలిపి) టీఆర్‌ఎస్ కైవసం చేసుకోగా, కాంగ్రెస్, బీజేపీలు రెండేసి స్థానాలకే పరిమితమయ్యాయి. ఎంఐఎం ఒక స్థానంతో సరిపెట్టుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఖాతా తెరువకపోవడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement