ప్రేమ పేరుతో వంచన | girl pregnent by cheater | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో వంచన

Published Wed, Aug 10 2016 9:45 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

girl pregnent by cheater

►గర్భం దాల్చిన బాలిక.. ఆలస్యంగా వెలుగులోకి..
►పోలీసుల అదుపులో నిందితుడు

చిన్నకోడూరు: ప్రేమ, పెళ్లి అని చెప్పి బాలికను లొంగదీసుకున్న ఓ యువకుడు చివరకు మొహం చాటేశాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బహిర్గతమైంది. బాలిక కుటుంబసభ్యల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితునిపై బుధవారం కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మెదక్‌ జిల్లా సిద్దిపేట రూరల్‌ సీఐ వెంకటయ్య, ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాలు..

చిన్నకోడూరు గ్రామానికి చెందిన బాలిక (16) ఇటీవల చిన్నకోడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. ఏడు నెలల కిందట పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించినప్పడు సిద్దిపేటకు చెందిన యువకుడు సాబేర్‌తో పరిచయం ఏర్పడింది. తన ఫోన్‌ నంబర్‌ బాలికకు ఇచ్చాడు. ఫోన్‌ మాటలు కాస్త ప్రేమగా మారింది. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికకు నమ్మబలికిలిన సాబేర్‌తో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు.

తీరా బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు ఆమెను నిలదీశాడు. దీంతో వారు సాబేర్‌ను నిలదీయగా అతను మొహం చాటేశాడు. అప్పటికే బాలిక నాలుగు నెలల గర్భిణి కావడంతో బాధితులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అదులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అసలు నిజం ఏంటి?
చిన్నకోడూరుకు చెందిన బాలికపై ఐదురుగు వ్యక్తులు కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చిందంటూ బుధవారం పలు చానెళ్లలో జోరుగా ప్రచారం జరిగింది. వాస్తవానికి బాధిత బాలిక మానసిక వైకల్యాన్ని అలుసుగా తీసుకొని ఐదుగురు కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడినట్లు గ్రామంలోనూ చెప్పుకుంటున్నారు.

దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఒక్కరే ప్రేమ పేరుతో అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పడంతో కేసుపై కొంత సందిగ్ధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తనతో పాటు మరికొందరున్నారని నిందితుడు చెప్పడం కొసమెరుపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement