ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది.
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. మంగళవారం 30 అడుగుల నీటిమట్టం నమోదైంది. స్నానఘట్టాల వద్దకు నీరు చేరింది. మెట్ల రేవులో దుకాణాలను యుద్ధ ప్రాతిపదికన ఎగువకు మార్చారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి 6 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 8,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద క్రమేపీ గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. బుధవారం నాటికి 35 అడుగులకు పైగా నీటిమట్టం చే రే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు తెలిపారు. బుధ, గురువారాల్లో గణపతి విగ్రహాల నిమజ్జనోత్సవం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం సాయంత్రం గోదావరి తీరంలో పరిస్థితిని పరిశీలించిన అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు.