ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది.
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరికి వరద వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రానికి 27.8 అడుగులకు చేరింది. అర్ధరాత్రి వరకు వరద ఉధతి తగ్గే అవకాశం ఉన్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. కాగా.. తాలిపేరు ప్రాజెక్టుకు 11 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపారు.