చర్ల మండలం పెదమిడిసిలేరు సమీపంలోని తాలిపేరు ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుతోంది.
చర్ల(ఖమ్మం జిల్లా): చర్ల మండలం పెదమిడిసిలేరు సమీపంలోని తాలిపేరు ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ రాష్ట్రం చత్తీస్‌గడ్‌లో భారీగా వర్షాలు పడుతుండటంతో సుమారు 10 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుకుంటోంది. దీంతో ప్రాజెక్టు 4 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 6 వేల క్యూసెక్కుల నీరును బయటికి వదిలారు. ఎగువన కురుస్తోన్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చే అవకాశముందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.