కేరళీయుల సేవా భావం
కేరళీయుల సేవా భావం
Published Sun, Jul 24 2016 11:25 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
మురళీనగర్: కేరళీయులు సేవా కార్యక్రమాల్లో ముందుంటూ తమ సామాజిక బాధ్యతను చాటుతారు. వీరు తమ సంస్కతితోపాటు ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. తాము నివసిస్తున్న ప్రాంతానికి సేవచేయాలనే తపన వారిలో కనిపిస్తుంది. ఈతపనలో భాగంగానే ఆదివారం మెగా వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి అనేకమందికి ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించారు. మురళీనగర్ సమీపం బిర్లా కూడలిలో ఉన్న కేరళ కళాసమితి ప్రాంగణంలో ఒకే సారి రక్తదానం, సాధారణ వైద్య పరీక్షలు, నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించారు. యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురికి వైద్య పరీక్షలు చేశారు.
ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవరచుకోవాలి: ఈసందర్భంగా కేర్ సీనియర్ కార్డియాలజీ సీనియర్ సర ్జన్ డాక్టర్ పి.వి.సత్యన్నారాయణ ప్రసంగిస్తూ గుండె సంబంధిత వ్యాధులు, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రొజక్టర్ ద్వారా వివరించారు. ప్రస్తుత స్పీడు ప్రపంచంలో సమయం లేదనే సాకుతో అప్పటికి ఏది అందుబాటులో ఉండే ఆ ఆహారం తినేయడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవరుచుకోవాలన్నారు. ముఖ్యంగా కొలస్ట్రాల్ లేని ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచించారు. కొబ్బరి నూనెతో చేసిన వంటకాలు తినడం మంచిదని ఇందులో అన్ని నూనెల కన్నా తక్కువ కొలస్ట్రాల్ ఉంటుందని ఆయన వివరించారు. జంక్ ఫుడ్ తినకూదన్నారు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యాన్ని సగం బాగుచేసుకోవచ్చని వివరించారు. కార్యక్రమాన్ని కళా సమితి అధ్యక్ష, కార్యదర్శులు కె.వి.విజయకుమార్, కె.శిశిధరణ్, కోశాధికారి జార్జ్ థామస్ ప్రవేక్షించారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు నిర్వహించిన వైద్య శిబిరంలో 199మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంకులకు 29యూనిట్లు రక్త దానం చేశారు. అగర్వాల్ కింటి వైద్య శాల సౌజన్యతో 90మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. కేర్ ఆస్పత్రి వైద్య శిబ్బంది 109మందికి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు.
Advertisement
Advertisement