ఎల్‌ఎండీలో బీసీ బాలికల గురుకుల కళాశాలకు అనుమతి
Published Thu, Jul 28 2016 10:11 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
తిమ్మాపూర్: ఎల్‌ఎండీలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల(బాలికలు)ను జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 16 బీసీ గురుకుల పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయగా.. జిల్లాలో ఎల్‌ఎండీలోని బాలికల గురుకుల పాఠశాల ఒకటి. 2016–17 విద్యా సంవత్సరంలోనే జూనియర్ కళాశాల ప్రారంభమవుతుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. తిమ్మాపూర్‌లోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను కళాశాలగా అప్‌గ్రేడ్ చేయడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోనున్నట్లు ప్రిన్సిపాల్ నాగభూషణం తెలిపారు. ఒక్కో కోర్సులో 40 సీట్లు భర్తీ చేస్తామని, వీటికి ఇప్పటికే రాత పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయితే ఆగస్టులో జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం తరగతుల నిర్వహించాల్సి ఉందని చెప్పారు. పక్కా భవనంలో గదులు లేని కారణంగా భవనం అద్దెకు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు.
Advertisement