
పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్పుల కలకలం
ప్రశాంతతకు మారుపేరైన గోదావరి జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది.
ఏలూరు: ప్రశాంతతకు మారుపేరైన గోదావరి జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. భూ వివాదం విషయంలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది.
వివరాల్లోకి వెళ్లితే...పాలకోడేరు మండల గొల్లలకోడేరు సర్పంచ్ సూర్యనారాయణ రాజు గ్రామానికి చెందిన చెరువు స్థలంలో మూడు సెంట్ల భూమిను బ్రాహ్మణ సంఘానికి కేటాయించాడు. దీనిపై రామకృష్ణరాజు అనే వ్యక్తి అభ్యంతరం తెలిపాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఆ స్థలం రాజులకు చెందినదని, బ్రాహ్మణులకు కేటాయించడం సరికాదని ఆదివారం ఉదయం సర్పంచ్‌తో అతను వాగ్వివాదానికి దిగాడు. దీంతో మాటామాటపెరగడంతో రామకృష్ణరాజు తనదగ్గరున్న రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. కాగా, తుపాకీతో తనను బెదిరించినట్టు సర్పంచ్ సూర్యానారాయణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రామకృష్ణరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.