
ఏసీబీ వలలో హెడ్ కానిస్టేబుల్
గుంటూరు: లంచం తీసుకుంటూ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
తాడేపల్లికు చెందిన ఓ వ్యక్తి పాస్పోర్టు కోసం అప్లై చేసుకున్నాడు. వెరిఫికేషన్ క్లియరెన్స్ కోసం కానిస్టేబుల్ వీరయ్య అతన్ని రూ.2 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం మధ్యాహ్న సమయంలో స్టేషన్లో లంచం తీసుకుంటుండగా వీరయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.