పాఠశాలల సముదాయాలు నిర్వీర్యం
కొరవడిన పర్యవేక్షణ
తమ స్కూళ్లకే పరిమితమైన హెచ్‌ఎంలు
అనంతపురం ఎడ్యుకేష¯న్ : పాఠశాల పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన పాఠశాల సముదాయాలు (స్కూల్ కాంప్లెక్స్‌లు) గాడి తప్పాయి. జిల్లాలో ఒక్కో మండలంలో సగటున 30–40 పాఠశాలలున్నాయి. ప్రతి మండలంలోనూ పాఠశాలలు, ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా స్కూల్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేసి హెచ్‌ఎంను స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ గా, సహాయకుడిగా ఒక సీఆర్పీ (క్లస్టర్ రీసోర్స్ పర్స¯Œన్)ను నియమించారు. జిల్లాలో 357 క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్ కింద సగటున 12 స్కూళ్లు ఉన్నాయి. స్కూల్ కాంప్లెక్స్‌ల హెచ్‌ఎంలు తమ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ ఆయా పాఠశాలల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకునేవారు. అయితే వీరికి అధికారాలు లేకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవడంతో రానురాను ఈ వ్యవస్థ పతనానికి దారి తీస్తోంది.
లక్ష్యం..
విద్యా ప్రమాణాల రూపకల్పన, అమలుకు కేంద్రంగా ఉంటోంది. భౌతిక, మానవ, ఆర్థిక వనరులను సమర్థంగా వినియోగించుకోవాలి. కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల పనితీరును మెరుగు పరిచి, విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయ వృత్తిపర నైపుణ్యాలను పెంపొందేలా, తరగతి గది అనుభవాలను పంచుకునేలా కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటు చేయాలి. తరగతి గదుల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించడం.
స్కూల్ కాంప్లెక్స్ చైర్మ¯Œన్ బాధ్యతలు
పరిపాలనా సంబంధ, విద్యా సంబంధ అంశాలపై పాఠశాలలకు స్కూల్ కాంప్లెక్స్ చైర్మ¯ŒS (హెచ్‌ఎం) మార్గదర్శకత్వం వహించాలి. పాఠశాలల్లో టీచర్లు, విద్యార్థుల హాజరు, బోధనాభ్యసన పద్ధతులను పరిశీలించి గుణాత్మకతను సాధించడానికి టీచర్లకు అవసరమైన సలహాలు, సూచనలివ్వాలి. కాంప్లెక్స్‌కు విడుదలయ్యే స్కూల్ కాంప్లెక్స్ గ్రాంటు సక్రమంగా ఖర్చు చేసేలా చూడాలి.
జరుగుతోందిలా...
2014–15 విద్యా సంవత్సరం నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు కాని, టీచర్లకు శిక్షణ కానీ సాగడంలేదు. వచ్చిన నిధులు కూడా కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల అవసరాలకు ఖర్చు చేసేసి చేతులు దులుపుకుంటున్నారు. సమావేశాలు కూడా తూతూమంత్రంగా నిర్వహించి టీలు తాగి పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ కాలం వెల్లదీస్తున్నారన్న విమర్శలున్నాయి. స్కూల్ కాంప్లెక్స్‌ల పనితీరును పర్యవేక్షించే నాథుడే కరువయ్యారు.
హెచ్‌ఎంలు బాధ్యతగా పనిచేయాలి..
స్కూల్ కాంప్లెక్స్‌లు సరిగా జరగడం లేదనేది వాస్తవమే. ఈ వ్యవస్థ చాలా మంచి ఉద్దేశంతో ఏర్పాటైనది. స్కూల్ కాంప్లెక్స్‌ల హెచ్‌ఎంలు బాధ్యతగా పని చేస్తే ఎంఈఓలపై ఒత్తిడి తగ్గుతుంది. కాంప్లెక్స్ పరిధిలో తక్కువ స్కూళ్లు ఉండడంతో మానటరింగ్ సులభంగా ఉంటుంది. చిన్నచిన్న లోపాలను గుర్తించినా వెంటనే పరిష్కరించే వీలుంటుంది. ప్రణాళిక రూపొందించి ఉద్దేశం నీరుగారకుండా చర్యలు తీసుకుంటాం.
– దశరథరామయ్య, ఎస్‌ఎస్‌ఏ పీఓ