Dasaratha Ramaiah
-
పాఠశాలల సముదాయాలు నిర్వీర్యం
కొరవడిన పర్యవేక్షణ తమ స్కూళ్లకే పరిమితమైన హెచ్ఎంలు అనంతపురం ఎడ్యుకేష¯న్ : పాఠశాల పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన పాఠశాల సముదాయాలు (స్కూల్ కాంప్లెక్స్‌లు) గాడి తప్పాయి. జిల్లాలో ఒక్కో మండలంలో సగటున 30–40 పాఠశాలలున్నాయి. ప్రతి మండలంలోనూ పాఠశాలలు, ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా స్కూల్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేసి హెచ్ఎంను స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ గా, సహాయకుడిగా ఒక సీఆర్పీ (క్లస్టర్ రీసోర్స్ పర్స¯Œన్)ను నియమించారు. జిల్లాలో 357 క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్ కింద సగటున 12 స్కూళ్లు ఉన్నాయి. స్కూల్ కాంప్లెక్స్‌ల హెచ్ఎంలు తమ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ ఆయా పాఠశాలల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకునేవారు. అయితే వీరికి అధికారాలు లేకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవడంతో రానురాను ఈ వ్యవస్థ పతనానికి దారి తీస్తోంది. లక్ష్యం.. విద్యా ప్రమాణాల రూపకల్పన, అమలుకు కేంద్రంగా ఉంటోంది. భౌతిక, మానవ, ఆర్థిక వనరులను సమర్థంగా వినియోగించుకోవాలి. కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల పనితీరును మెరుగు పరిచి, విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయ వృత్తిపర నైపుణ్యాలను పెంపొందేలా, తరగతి గది అనుభవాలను పంచుకునేలా కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటు చేయాలి. తరగతి గదుల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించడం. స్కూల్ కాంప్లెక్స్ చైర్మ¯Œన్ బాధ్యతలు పరిపాలనా సంబంధ, విద్యా సంబంధ అంశాలపై పాఠశాలలకు స్కూల్ కాంప్లెక్స్ చైర్మ¯ŒS (హెచ్ఎం) మార్గదర్శకత్వం వహించాలి. పాఠశాలల్లో టీచర్లు, విద్యార్థుల హాజరు, బోధనాభ్యసన పద్ధతులను పరిశీలించి గుణాత్మకతను సాధించడానికి టీచర్లకు అవసరమైన సలహాలు, సూచనలివ్వాలి. కాంప్లెక్స్‌కు విడుదలయ్యే స్కూల్ కాంప్లెక్స్ గ్రాంటు సక్రమంగా ఖర్చు చేసేలా చూడాలి. జరుగుతోందిలా... 2014–15 విద్యా సంవత్సరం నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు కాని, టీచర్లకు శిక్షణ కానీ సాగడంలేదు. వచ్చిన నిధులు కూడా కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల అవసరాలకు ఖర్చు చేసేసి చేతులు దులుపుకుంటున్నారు. సమావేశాలు కూడా తూతూమంత్రంగా నిర్వహించి టీలు తాగి పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ కాలం వెల్లదీస్తున్నారన్న విమర్శలున్నాయి. స్కూల్ కాంప్లెక్స్‌ల పనితీరును పర్యవేక్షించే నాథుడే కరువయ్యారు. హెచ్ఎంలు బాధ్యతగా పనిచేయాలి.. స్కూల్ కాంప్లెక్స్‌లు సరిగా జరగడం లేదనేది వాస్తవమే. ఈ వ్యవస్థ చాలా మంచి ఉద్దేశంతో ఏర్పాటైనది. స్కూల్ కాంప్లెక్స్‌ల హెచ్ఎంలు బాధ్యతగా పని చేస్తే ఎంఈఓలపై ఒత్తిడి తగ్గుతుంది. కాంప్లెక్స్ పరిధిలో తక్కువ స్కూళ్లు ఉండడంతో మానటరింగ్ సులభంగా ఉంటుంది. చిన్నచిన్న లోపాలను గుర్తించినా వెంటనే పరిష్కరించే వీలుంటుంది. ప్రణాళిక రూపొందించి ఉద్దేశం నీరుగారకుండా చర్యలు తీసుకుంటాం. – దశరథరామయ్య, ఎస్ఎస్ఏ పీఓ -
ఎస్కేయూ రిజిస్ట్రార్‌కు షోకాజ్ నోటీసులు
అనంతపురం: శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ రిజిస్ట్రర్ దశరథ రామయ్యపై ఆర్టీఏ కమిషనర్ తాంతియా కుమారి మండిపడ్డారు. సమాచార చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనకు ఈసందర్భంగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే రూ. 2 వేలు జరిమానా విధించారు. బుధవారం అనంతపురంలో సమాచార హక్కు చట్టంపై తాంతియా కుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమ్మార్వోలు, వ్యవసాయ అధికారులకు నోటీసులు జారీ చేస్తామని ఈ సందర్భంగా తాంతియా కుమారి హెచ్చరించారు. -
మహిళా అధికారిపై మళ్లీ వేధింపులు..!
ఇంట్లోకి చొరబడి కొంత మంది వ్యక్తుల బీభత్సం డిప్యూటీ రిజిస్ట్రార్ హరిణి భర్త కుమారస్వామితో దురుసు ప్రవర్తన తమతో తెచ్చిన కాగితాలపై సంతకాలు చేయాలంటూ ఒత్తిడి ఆగంతకులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమారస్వామి ప్రస్తుతం ప్రసవం కోసం ఆస్పత్రిలో ఉన్న హరిణి సాక్షి, హైదరాబాద్: ‘ఏపీ హైకోర్టు కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’కి సంబంధించిన ఫైళ్ల వివాదం మరింతగా ముదురుతోంది.. ఆ అక్రమాలను వెలుగులోకి తెచ్చిన తనపై ఉన్నతాధికారి ఒకరు వేధింపులకు పాల్పడుతున్నారని సహకారశాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ పి.హరిణి ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రికార్డుల కోసం హరిణి నివాసానికి కొంత మంది వ్యక్తులు వచ్చి, బీభత్సం సృష్టించడంతో ఇది మళ్లీ తెరపైకి వచ్చింది. తమ ఇంట్లో కొంత మంది ఆగంతకులు ప్రవేశించి బీభత్సం సృష్టించారని హరిణి భర్త కుమారస్వామి జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. నిండు గర్భిణి అయిన హరిణి ప్రస్తుతం ప్రసూతి సెలవుల్లో ఉన్నారు. ప్రసవం కోసం ఆమె ఆస్పత్రిలో చేరడంతో... ఆగంతకులు వచ్చిన సమయంలో ఆమె భర్త మాత్రమే ఇంట్లో ఉన్నారు. పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం కుమారస్వామి విలేకరులకు ఈ వివరాలను వెల్లడించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 46లో ఉన్న హరిణి నివాసంలోకి గురువారం ఉదయం ఆరుగురు వ్యక్తులు దౌర్జన్యంగా చొరబడ్డారు. వెంటనే గదులన్నింటినీ గాలించడం మొదలుపెట్టారు. నిండు గర్భంతో ఉన్న తన భార్య హరిణి ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిం దని కుమారస్వామి చెప్పినా వినిపించుకోకుండా... వచ్చిన వాళ్లు ఫైళ్లకోసం ఇంట్లోని టేబుళ్లన్నీ వెతికారు. ఆ తర్వాత వారు తమతో పాటు తీసుకువచ్చిన కాగితాల మీద సంతకాలు పెట్టాలంటూ కుమారస్వామిపై ఒత్తిడి చేశారు. అసలు మీకు ఏం కావాలని ప్రశ్నించగా... హైదరాబాద్ జిల్లా సహకారశాఖ అధికారి దశరథ రామయ్యతో కుమారస్వామిని ఫోన్లో మాట్లాడిం చారు. ఓ అధికారి ఆదేశాల మేరకు సంతకాల కోసం పంపించామని దశరథ రామయ్య కుమారస్వామికి చెప్పారు. కానీ కుమారస్వామి ఆ పత్రాలపై సంతకాలు చేయకపోవడంతో ఆగంతకులు ఇంటి బయట ఓ నోటీసును అతికించి వెళ్లిపోయారు. -
'ఎస్కేయూ వీసీని సస్పెండ్ చేయాలి'
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ దశరథరామయ్యను సస్పెండ్ చేయాలని వైఎస్సార్ విద్యార్ధి విభాగం నాయకులు డిమాండ్ చేస్తూ శనివారం ఎస్కేయూ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలకు వీసీ శుక్రవారం హాజరయ్యారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడమేంటని వారు నిలదీశారు. ఆ వీసీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వీసీలా కాకుండా టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
‘స్కానింగ్’ నిప్పు
రోగ నిర్ధారణ చేయాల్సిన కొన్ని స్కానింగ్ సెంటర్లు గాడి తప్పాయి. కాసుల కోసం నిండు జీవితాల్లో నిప్పులు పోస్తున్నాయి. పుట్టబోయేది ఏ బిడ్డో చెప్పడం ద్వారా తల్లికి గర్భశోకం మిగిల్చి, కుటుంబాన్ని ఛిద్రం చేస్తున్నాయి. దీంతో ఆ బిడ్డలు గర్భంలోనే కరిగిపోతున్నారు. ఇంకొందరు లోకం వెలుగు చూడకుండానే మట్టిలో కలిసిపోతున్నారు. తిరుపతి కార్పొరేషన్: ‘ఆడపిల్ల పుట్టిందని తిరుపతికి చెందిన ఓ మహిళను అత్తారింటి వారు బయటకు గెంటేశారు. రెండో సారి ఆడపిల్ల అని తెలిసిన ఎంఆర్పల్లెకు చెందిన పుష్పలతకు అత్తా, భర్త కలసి బలవంతంగా అబార్షన్ చేయించారు’ ఇవి మచ్చుకు మాత్రమే. ఇలాంటి సంఘటనలు చెప్పాలంటే చాంతాడంత పొడుగు ఉంటుంది. చట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ చేస్తున్న స్కానింగ్ సెంటర్లే ఇందుకు ప్రధాన కారణం. లింగనిర్ధారణ చట్టవిరుద్ధమని దీనిని ప్రభుత్వం నిషేధించింది. అయితేనేం కళ్ల ముందు కాసులు చూపిస్తే నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ, పచ్చని కాపురాల్లో కలహాలు పెడుతున్నాయి జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు. గర్భంలోని శిశువు ఎదుగుదల, ఆరోగ్య స్థితి గతుల వివరాలను తెలుసుకునేందుకే స్కానింగ్ సెంటర్లు పనిచేయాలి. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, లింగనిర్ధారణ పరీక్షలు చేస్తుండడంతో పుట్టేది ఆడపిల్లేనని ముందుగానే తెలిసిపోతోంది. దీంతో తొలి కాన్పు అనికూడా చూడకుండా భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన జిల్లా వైద్యాధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో స్కానింగ్ సెంటర్లకు కాసుల పంట కురిపిస్తోంది. చట్టం వీరికి వర్తించదా? భ్రూణ హత్యలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం 1994లో ఒక చట్టాన్ని రూపొందించింది. దీన్ని గర్భస్థ పిండ పరీక్ష ప్రక్రియ చట్టంగా తీసుకొచ్చింది. ఆపై 2003లో సమగ్ర సవరణలతో గ ర్భదారణ పూర్వ, గర్భస్థ పిండ ప్రక్రియ (లింగ ఎంపిక నిషేధం) చట్టంగా ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలో ఇష్టారాజ్యంగా స్కానింగ్ సెంటర్లు ఏర్పాటవుతుండడం, ఒక్క తిరుపతిలోనే దాదాపు 250కి పైగా ఉన్నట్టు అధికారులే చెబుతున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. స్కానింగ్ సెంటర్ల వద్దకు వచ్చే వారు తమ అవసరం, పరిస్థితులను బట్టి అధికంగా డబ్బులు ఆశచూపెడుతున్నారు. దీంతో నిబంధనలను పక్కనబెట్టి లింగనిర్ధారణ పరీక్షలను చేస్తూ అధికంగా సంపాదించుకుంటున్నారు. పేరుకే కమిటీలు ! జిల్లా స్థాయి మల్టీ మెంబరు అప్రాపరేట్ అథారిటీలో కలెక్టర్,జిల్లా న్యాయమూర్తి, ఎస్పీ, డీఎంహెచ్‌వో, ఎన్జీవో సభ్యుడు ఐదుగురు సభ్యులుగా ఉంటారు. జిల్లా అడ్వైజరీ కమిటీ 15 మంది సభ్యులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేస్తుంది. ఈరెండు కమిటీలు ప్రతి రెండు నెలలకు ఒక సారి సమావేశం కావాలి. అలాంటి సమావేశాలు నిర్వహించినట్టు దాఖలాలు లేవు. జిల్లా డెమో విభాగాధికారులు స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులతో ప్రతినెలా సదస్సు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆఊసే లేదు. తాజా నిబంధనల ప్రకారం ప్రతి స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు వైద్యులై ఉండాలి. రిజిస్ట్రేషన్ లేకుండా కేంద్రాలను నిర్వహిస్తే వాటిని సీజ్ చేసి, నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. అయితే అవేమి లేకుండా కేవలం నోటీసులు జారీ చేసి మమ అనిపించేస్తున్నారు. చర్యలు తీసుకుంటున్నాము లింగనిర్ధారణ చట్టపరమైన నేరం. స్కానింగ్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తమ దృష్టికి వస్తున్నాయి. ఇప్పటికే తిరుపతిలో వీణాకు స్కానింగ్ చేసి, లింగనిర్ధారణ పరీక్షలు చేసినందుకు నోటీసులు ఇచ్చాం. నగరంలో అనుమతిలేని కేంద్రాలను గుర్తించాం. ఆలాంటి కేంద్రాలను సీజ్ చేస్తాం. -డాక్టర్ దశరథరామయ్య,జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి