'ఎస్కేయూ వీసీని సస్పెండ్ చేయాలి' | sku vc should be suspended, demands ysrsf | Sakshi
Sakshi News home page

'ఎస్కేయూ వీసీని సస్పెండ్ చేయాలి'

Published Sat, Jan 24 2015 3:43 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ దశరథరామయ్యను సస్పెండ్ చేయాలని వైఎస్సార్ విద్యార్ధి విభాగం నాయకులు డిమాండ్ చేస్తూ శనివారం ఎస్కేయూ బంద్కు పిలుపునిచ్చారు.

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ దశరథరామయ్యను సస్పెండ్ చేయాలని వైఎస్సార్ విద్యార్ధి విభాగం నాయకులు డిమాండ్ చేస్తూ శనివారం ఎస్కేయూ బంద్కు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలకు వీసీ శుక్రవారం హాజరయ్యారు.

ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడమేంటని వారు నిలదీశారు. ఆ వీసీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వీసీలా కాకుండా టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement