సంక్షేమ పథకాల ప్రదాత వైఎస్సార్‌ | ysrcp anniversary in sku | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాల ప్రదాత వైఎస్సార్‌

Mar 12 2017 11:32 PM | Updated on Nov 6 2018 5:13 PM

సంక్షేమ పథకాల ప్రదాత వైఎస్సార్‌ - Sakshi

సంక్షేమ పథకాల ప్రదాత వైఎస్సార్‌

సంక్షేమ పథకాల ప్రదాత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి అన్నారు.

ఎస్కేయూ : సంక్షేమ పథకాల ప్రదాత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు  నారాయణరెడ్డి అన్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఆదివారం  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణరెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని సూచించారు.

విద్యార్థి విభాగం పటిష్టతకు , విద్యార్థి ఉద్యమాలకు లీగల్‌ సెల్‌ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి లింగారెడ్డి, లీగల్‌ సెల్‌ సభ్యులు ఎస్‌ఎల్‌వీ ప్రసాద్, ఎస్కేయూ నాన్‌ టీచింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టి. పురుషోత్తం రెడ్డి, బాలకృష్ణా రెడ్డి, డాక్టర్‌ గంగాధరయ్య, వైఎస్సార్‌ విద్యార్థి విభాగం ఎస్కేయూ అధ్యక్షుడు వై.భానుప్రకాష్‌ రెడ్డి, గెలివి నారాయణరెడ్డి, జయచంద్రా రెడ్డి, హేమంత్, శంకర్‌ నాయక్, రాంబాబు, శ్రీనివాసులు, జయంత్‌ , రాజారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement