ప్రజా సంక్షేమమే వైఎస్సార్ సీపీ ధ్యేయం!
– రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి
– పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ
- జిల్లా వ్యాప్తంగా కొనసాగిన వేడుకలు
అనంతపురం : ప్రజా సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శంకరనారాయమ మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన, సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం ఏర్పాటైన వైఎస్సార్ సీపీ ఆరేళ్లు పూర్తి చేసుకుని ఏడో వసంతంలోకి అడుగు పెట్టిందన్నారు. కోట్లాది మంది ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లేకపోవడం బాధాకరమన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాల సాధన కోసం వైఎస్ జగన్ పరితపిస్తున్నారన్నారు.
వైఎస్సార్‌సీపీ నిత్యం ప్రజల పక్షాన పోరాటాలు చేస్తోందన్నారు. అన్ని వర్గాలను వంచిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీం అహ్మద్ మాట్లాడుతూ, తెలుగుజాతి ఆత్మగౌరవం నిలబెట్టాలన్నా, రామన్న రాజ్యం తిరిగి రావాలన్నా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో అన్ని వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా న్యాయం జరిగిందన్నారు. అదే స్ఫూర్తితోనే జగన్ ముందుకు వెళ్తున్నారన్నారు. జనాకర్షణ, నిజాయితీ కల్గిన జగన్ నాయకత్వం కోసం ›ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆరోజు దగ్గర్లోనే ఉందన్నారు. మాజీ మేయర్ రాగే పరుశురాం మాట్లాడుతూ, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ మూడేళ్లవుతున్నా ఒక్క హామీనూ అమలు చేయలేదన్నారు.
దివంగత వైఎస్సార్ హయాంలో అన్ని వర్గాలకూ న్యాయం చేశారన్నారు. ఆయన స్ఫూర్తితోనే వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ ›క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బి. ఎర్రిస్వామిరెడ్డి, నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, బత్తలపల్లి ఎంపీపీ కోటి సూర్యప్రకాష్‌బాబు, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, జిల్లా అధికార ప్రతిని«ధులు ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, మన్సూర్, సేవాదళ్, ఎస్సీ సెల్, సాంస్కృతిక, ట్రేడ్, మహిళా, విద్యార్థి విభాగాల జిల్లా అధ్యక్షులు మిద్దె భాస్కర్‌రెడ్డి, పెన్నోబులేసు, రిలాక్స్ నాగరాజు, మరువపల్లి ఆదినారాయణరెడ్డి, బోయ సుశీలమ్మ, బండి పరుశురాం, నాయకులు యూపీ నాగిరెడ్డి, కొర్రపాడు హుసేన్‌పీరా, జేఎం బాషా, లింగారెడ్డి, వెంకటరామిరెడ్డి, బలరాం, రామచంద్రారెడ్డి, బీసీ సెల్ శీనా, తాటిచెర్ల నాగేశ్వరరెడ్డి, ఎంఎస్‌ఎస్ సాదిక్, మహిళా విభాగం శ్రీదేవి, ఉషా, కొండమ్మ, షహతాజ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా వేడుకలు
– రాయదుర్గం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
– గుంతకల్లు పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త వెంకటరామిరెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు.
– మడకశిర పట్టణంలో సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి కేక్ కట్ చేశారు.
– కదిరి పట్టణం నిజాంవలికాలనీలో సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
– ధర్మవరం పట్టణంలోని పాండురంగ సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసులు ఆధ్వర్యంలో పూలమాలలు వేసిన అనంతరం కేక్ కట్ చేశారు.
– ఉరవకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జెడ్పీటీసీ సభ్యులు లలితమ్మ, తిప్పయ్య, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు తదితరులు జెండా ఆవిష్కరించారు.