స్వచ్ఛతతో ఆరోగ్య సమాజం | HEALTHY COMMUNITY WITH PURITY | Sakshi
Sakshi News home page

స్వచ్ఛతతో ఆరోగ్య సమాజం

Published Sun, Aug 7 2016 10:07 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

స్వచ్ఛతతో ఆరోగ్య సమాజం

స్వచ్ఛతతో ఆరోగ్య సమాజం

తాడేపల్లిగూడెం : మన ఇల్లు.. మన ఊరు.. మన దేశం కోసం అందరూ కలిసి పనిచేసి స్వచ్ఛభారత్‌ సాధించి ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి భాగస్వాములు కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా స్థానిక సవితృపేట 15వ వార్డులో ఆదివారం నిర్వహించిన సామూహిక పారిశుధ్య కార్యక్రమంలో మంత్రి పాల్గొని వీధులను శుభ్రం చేశారు. అనంతరం మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ అపారిశుధ్య వాతావరణం వల్ల ఏటా లక్షల కోట్ల రూపాయలను ఆసుపత్రులకు వెచ్చించాల్సి వస్తుందన్నారు. 
వారానికి రెండు గంటల వంతున సమయాన్ని వెచ్చించి స్వచ్ఛభారత్‌ నిర్వహిస్తే ప్రతి కుటుంబానికి ఏటా వేలాది రూపాయలు ఆసుపత్రి ఖర్చులు ఆదా అవుతాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బృహత్తరమైన జాతీయ కార్యక్రమంగా స్వచ్ఛభారత్‌ను నిర్వహించేందుకు కంకణబద్ధులయ్యారన్నారు. ఈ కమిటీకి జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం వహిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కాపు యువత, సవితృపేట యూత్, మదర్‌ థెరిస్సా సంఘాలను మంత్రి అభినందించారు. ప్రముఖ వ్యాపారవేత్త నంద్యాల కృష్ణమూర్తి, మునిసిపల్‌ కౌన్సిలర్‌ యెగ్గిన నాగబాబు, బీజేపీ జిల్లా కార్యదర్శి కంచుమర్తి నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు నరిశే సోమేశ్వరరావు, పేరిచర్ల మురళీకృష్ణంరాజు పాల్గొన్నారు. తొలుత నంద్యాల కృష్ణమూర్తి మునిసిపల్‌ పాఠశాలను మంత్రి మాణిక్యాలరావు పరిశీలించి పరిశుభ్రత నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement