ఈరన్నకు భక్త నీరాజనం
కౌతాళం: ఉరుకుంద క్షేత్రానికి శ్రావణమాసం మూడో గురువారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. దాదాపు లక్షకు పైగా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడియి. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు తరలివచ్చారు. ప్రధానంగా కౌతాళం, కోసిగి మండలాల నుంచేకాక రాయచూరు, మహబూబ్‌నగర్ జిల్లానుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం కోసం 2 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. సీఐ దైవప్రసాద్ ఆధ్వర్యంలో కౌతాళం ఎస్‌ఐ నల్లప్ప తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఎన్‌సీసీ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు కౌతాళం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉచితంగా సేవలు అందించారు.