ఊరటనిచ్చిన వాన | heavy rain in anantapur district | Sakshi
Sakshi News home page

ఊరటనిచ్చిన వాన

Published Tue, Sep 5 2017 9:32 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM

ఊరటనిచ్చిన వాన - Sakshi

ఊరటనిచ్చిన వాన

జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం
ఒకే రోజు 25.9 మి.మీ భారీ సగటు నమోదు
ఖరీఫ్‌ పంటలకు ఉపశమనం
ప్రత్యామ్నాయం, పాడి, పట్టు, పండ్లతోటలకు మేలు


అనంతపురం అగ్రికల్చర్‌: వరుణుడు కరుణించాడు. మూడు నెలలుగా మొహం చాటేసిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు ప్రభావం చూపించాయి. దీంతో జిల్లాలోని 63 మండలాల్లోనూ వర్షం కురిసింది. అలాగే ఒకే రోజు 25.9 మి.మీ భారీ సగటు వర్షపాతం కావడం ఈ ఖరీఫ్‌లో మొదటి సారి కావడం గమనార్హం. జూన్, జూలైలో దెబ్బతీసిన వర్షాలు ఆగస్టులో ఓ మాదిరి వర్షాలతో ఆశలు రేకెత్తించగా ఇపుడు కొన్ని మండలాల్లో భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ పంటలకు స్వల్పంగా నష్టం జరిగినా...ఈ వర్షం జిల్లాకు చాలా ఊరటనిచ్చిందని రైతులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తమ్మీద జూన్‌ ఒకటి నుంచి ఇప్పటివరకు 236 మి.మీ గానూ 227 మి.మీ వర్షపాతం నమోదైంది.

అక్కడక్కడ పంటలకు నష్టం
భారీ వర్షాలు కురిసిన మండలాల్లో కొంతవరకు పంట నష్టం వాటిల్లింది. పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామంలో రైతు వెంకటనారాయణకు చెందిన 4 ఎకరాల మిరప తోట నీటమునగడంతో రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లింది. రొద్దం మండలంలో హంద్రీ–నీవా కాలువ తెగిపోవడంతో సమీపంలో మూడు ఎకరాల కర్భూజా, రెండు ఎకరాల్లో ఆముదం, ఒక ఎకరా మిరప తోట నీటిమునగడంతో రూ.6 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు.

రాయదుర్గం మండలం నాగిరెడ్డిపల్లి చెరువుకు గండిపడటంతో సమీపంలో ఉన్న పంటలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఇక బెళుగుప్ప మండలం శీరిపిచెరువు, పెనుకొండ మండలం అడదాకులపల్లి చెరువులోకి రెండు మూడు నెలలకు సరిపడా వర్షపు నీరు చేరినట్లు సమాచారం. విడపనకల్లు మండలం గడేకల్లు చెరువులోకి భారీగా వర్షపు నీరు చేరింది. చాలా మండలాల్లో లోతట్లు ప్రాంతాలు జలమయం కాగా, వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహించాయి. చెక్‌డ్యాంలు, నీటికుంటలు జలకళను సంతరించుకున్నాయి. అక్కడక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి. తలుపుల మండలం బట్రేపల్లి జలపాతం కనువిందు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పంటలకు ఊరట
జూన్, జూలైలో అరకొర తేమకు వేసిన వేరుశనగ, కంది, ఆముదం, ప్రత్తి, మొక్కజొన్న లాంటి పంటలకు ఈ వర్షాలు మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే ఆగస్టు, ప్రస్తుతం వేస్తున్న పెసర, అలసంద, ఉలవ, జొన్న లాంటి ప్రత్యామ్నాయ పంటలకు ఈ వర్షం ఊరటనిచ్చిందంటున్నారు. అంతేకాకుండా ఎండుతున్న లక్షలాది ఎకరాల పండ్లతోటలు, పట్టు (మల్బరీ) తోటలకు కూడా మేలు జరుగుతుంది. ప్రస్తుతం 26.50 మీటర్ల మేర భారీగా క్షీణించిన భూగర్భజలాలు అక్కడక్కడ కొద్దిగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మండలం        నమోదైన వర్షపాతం (మి.మీ)
సోమందేపల్లి        71.6
పెద్దపప్పూరు         69.5
ధర్మవరం         67.1
బత్తలపల్లి         67.2
పెనుకొండ         61.7
తాడిపత్రి         59.1
విడపనకల్లు         58.2
బుక్కపట్నం        47.9
రామగిరి         43.8
అమడగూరు         43.6
పుట్లూరు         42.1
ముదిగుబ్బ         40.3
చెన్నేకొత్తపల్లి         37.7
హిందూపురం         37.3
వజ్రకరూరు         36.2
పెద్దవడుగూరు         36.2
గుంతకల్లు         34.5
డి.హిరేహాళ్‌        33.8
గాండ్లపెంట         33.6
కణేకల్లు             32.3
అగళి             32
రొద్దం             31.7
చిలమత్తూరు         30.9
కదిరి             30.5
నల్లమాడ         30.4
తాడిమర్రి         30.3
పరిగి             29.9
ఓడీ చెరువు         28.5
కొత్తచెరువు         26
కనగానపల్లి         25
నార్పల             24.5
ఉరవకొండ         20.9
గుత్తి             20.6
కంబదూరు         18.3
తలుపుల         18
గోరంట్ల             16.9
శింగనమల         16.6
పామిడి             16.2
బొమ్మనహాళ్‌         15.4
రొళ్ల             15.2
బెళుగుప్ప         14.9
కూడేరు             14.8
రాప్తాడు             13.8
నల్లచెరువు         13.1
యాడికి             12.8
పుట్టపర్తి             11.8

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement