ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
పులిచింతల(నల్లగొండ): ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 1,05,100 క్యూసెక్కులు వస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ నాలుగు గేట్లు నాలుగు మీటర్ల మేర పైకి ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా(ఔట్ ఫ్లో 1,05,100 క్యూసెక్కులు) దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటిమట్టం 49.96 మీటర్లు ఉండగా.. నీటి నిల్వ 30 టీఎంసీలు ఉంది.