తిరుపతి: తిరుపతి, తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. దీంతో కొండపైన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ రోడ్డులోని 8వ కిలోమీటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. విషయం తెలుసుకున్న అధికారులు కొండచరియలను తొలగించి వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. అలాగే కపిలతీర్థం వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది.