
భక్తులతో తిరుమల కిటకిట
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపల కూడా భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.
శనివారం శ్రీవేంకటేశ్వరస్వామిని 78,559 మంది భక్తులు దర్శించుకోగా 42,465 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.33 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.