తిరుమల : నూతన సంవత్సరం సందర్భం తిరుమల శుక్రవారం భక్తులతో కిక్కిరిపోయింది. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటలు... కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో 20 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు.
భక్తుల క్యూలైన్లను టీటీడీ ఈవో డి సాంబశివరావు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. అందులోభాగంగా భక్తులకు అల్పాహారంతో పాటు ఆహార పానీయాలను అందజేస్తున్నారు.