తిరుమల : తిరుమలలో ఆదివారం ఉదయం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 32 కంపార్ట్‌మెంట్లూ నిండిపోగా భక్తులు బయట క్యూలైన్లలో బారులు తీరారు. కాలిబాటలో వచ్చిన భక్తులకు 9 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 2 నుంచి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జన్మదినం సందర్భంగా ఆదివారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అలాగే, చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాస్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్‌శెట్టిలు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.