తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం 31 కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల బారులు తీరారు. స్వామివారి సర్వ దర్శనానికి 14 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) శ్రీవారిని 92 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.