19న శ్రీశైలానికి హెలికాఫ్టర్ సర్వీసు
19న శ్రీశైలానికి హెలికాఫ్టర్ సర్వీసు ప్రారంభం
Published Wed, Aug 17 2016 11:54 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
· రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీలు రాక
· హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి టికెట్ రూ.14,840
శ్రీశైలం : శ్రీశైలమహాక్షేత్రానికి భక్తుల సౌకర్యార్థం హెలికాఫ్టర్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త బుధవారం రాత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీశైలాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా హెలికాఫ్టర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెవెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ వివిధ హెలికాప్టర్ల కంపెనీలతో మాట్లాడిన తరువాత న్యూఢిల్లీ సమ్మిట్ ఏవియేషన్ కంపెనీ ఈ సర్వీసుల నిర్వహణకు ఆసక్తి చూపించి ముందుకు వచ్చింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పైడి కొండల మాణిక్యాలరావు, రెవెన్యూ ఎండోమెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, సమ్మిట్ ఏవియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ బాటియాలు ఇక్కడికి చేరుకుంటారని ఈఓ తెలిపారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వచ్చేందుకు 45 నిమిషాలు పడుతుందని, టికెట్ రూ. 14,840గా సమ్మిట్ ఏవియేషన్ సంస్థ నిర్ణయించిందని తెలిపారు. ప్రయాణంలో కృష్ణానది, నల్లమల అడవులు , ప్రకతి సౌందర్యాలను వీక్షించవచ్చునని ఈఓ వెల్లడించారు. పుష్కరాల తరువాత ఈ హెలికాఫ్టర్ సర్వీసులను హైదరాబాద్, విజయవాడ నుంచి కూడా శ్రీశైలానికి నడిపేందుకు సమ్మిట్ ఏవియేషన్ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఇతర వివరాలను ఇరా నరులా మొబైల్ నెం 09650388989 సమ్మిట్ ఏవియేషన్ సంస్థ వారిని సంప్రదిం^è వచ్చునని అన్నారు.
Advertisement