
కాంగ్రెస్ అభివృద్ధికి కృషిచేయాలి
నార్కట్‌పల్లి
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి యూవజన కాంగ్రెస్ నాయకులు కృషిచేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. యూవజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఆయన జెండా ఆవిష్కరించి మాట్లాడారు. యూవజన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, సిలువేరు జ్ఞానేశ్వర్‌గిరి, రాంరెడ్డి, పర్రెపాటి లింగస్వామి, బొబ్బలి యాదగిరి, తొడుసూరి నర్సింహ్మ, భద్రచలం, సత్తి, సైదులు, కార్తీక్, భారత్, బాలరాజు, వెంకన్న ఉన్నారు.