ఆలయం వద్ద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు
సాక్షి, తిరుమల: ఏపీ, తెలంగాణా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈసందర్భంగా రంగనాయక మండపంలో అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట టీటీడీ లా ఆఫీసర్ వెంకటరమణ, జిల్లా జడ్జి దుర్గాప్రసాద్ , ప్రోటోకాల్ జడ్జి శేషాద్రి ఉన్నారు.