సత్రంపై నుంచి కిందపడిన వ్యక్తి
పోలీసు సేవాదళ్‌కు సన్మానం
Published Fri, Feb 24 2017 10:58 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఆత్మకూరు: ప్రాణప్రాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తిని వైద్యశాలకు తరలించిన పోలీస్ సేవాదళ్ సభ్యులను జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ సన్మానించారు. శుక్రవారం రెడ్ల సత్రం వద్ద ఓ శివస్వామి మిద్దెపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీస్ సేవాదళ్ అతనిని గుర్తించి 108 అంబులెన్స్ తెప్పించి దేవస్థానం వైద్యశాలకు పంపారు. అక్కడ వైద్యాధికారిణి తేజస్వీ ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి 108లో తరలించారు. అతని వెంట సీఐని, పోలీస్ సిబ్బంది వెళ్లారు. కాగా ఈ వ్యక్తి కోమాలో ఉండడంతో వివరాలు తెలియలేదు. ప్రాణప్రాయస్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసిన సేవాదళ్‌లోని సీఐ ఆదిలక్ష్మి, కానిస్టేబుల్ వెంకటేశ్ నాయక్ ,లక్ష్మణ్‌రావు, 108 సిబ్బంది రాంబాబు, ప్రవీణ్‌కుమార్ రెడ్డి, శ్రీనివాసులు, బాలకృష్ణ, శ్రీధర్, సిబ్బందిని ఎస్పీ సన్మానించారు. సమాచారం తెలుసుకున్న డీఐజీ రమణారావు కూడా ఫోన్‌లో పోలీసు సేవా దళ్ సిబ్బందిని అభినందించారు.
Advertisement