
మంచి కథ లభిస్తే బాలకృష్ణతో నటిస్తా
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను
సావిత్రి చిత్ర కథానాయకుడు నారా రోహిత్
విజయవాడ : మంచి కథ లభిస్తే నందమూరి బాలకృష్ణతో కలిసి నటిస్తానని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. తాను నటించిన ‘సావిత్రి’ చిత్రం విడుదలైన సందర్భంగా ఆ చిత్రం ప్రదర్శిస్తున్న ఊర్వశి ఐనాక్స్ థియేటర్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ప్రేక్షకుల మధ్య కూర్చున్ని చిత్రాన్ని తిలకించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సావిత్రి పూర్తి కుటుంబ కథాచిత్రమన్నారు.
తానెప్పుటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే పనిచేస్తానన్నారు. సినిమా పైరసీని ప్రోత్సహించవద్దని ప్రేక్షకులను కోరారు. చిత్ర నిర్మాత డాక్టర్ వీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘సావిత్రి’ పూర్తి ఎమోషనల్, కామెడీ చిత్రమన్నారు. సంక్రాంతికే రావాల్సిన ‘సావిత్రి’ ఉగాదికి ప్రేక్షకుల ముందుకు వచ్చిందన్నారు. చిత్ర దర్శకుడు పవన్ సాధినేని మాట్లాడుతూ విజయవాడ తన సొంత ఊరని, ఇక్కడే ప్రేక్షకుల మధ్య సినిమా చూడాలనే తన ఆకాంక్ష నెరవేరిందన్నారు.