డబ్బులేకే ఓడిపోయానంటున్న సినీనటి | i was defeated in elections becuase i did not have money, says actress jamuna | Sakshi
Sakshi News home page

డబ్బులేకే ఓడిపోయానంటున్న సినీనటి

Published Sun, Jan 24 2016 6:18 PM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

డబ్బులేకే ఓడిపోయానంటున్న సినీనటి - Sakshi

డబ్బులేకే ఓడిపోయానంటున్న సినీనటి

భీమవరం : నేటి రాజకీయాలు సచ్ఛీలత, విలువలకు దూరంగా డబ్బుతో ముడిపడి వున్నాయని, అందువల్లనే వాటిలో ఇమడలేక తాను దూరంగా ఉంటున్నట్టు రాజమండ్రి మాజీ ఎంపీ, సినీనటి జమున అన్నారు. భీమవరం మావుళ్లమ్మ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరైన జమున ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఒకప్పుడు రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడమనే భావం ఉండేదని,  ఇప్పుడు మాత్రం రూ.లక్షలు ఖర్చుపెట్టి రూ.కోట్లు సంపాదించు అనే రీతిలో మారిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

1989లో రాజమండ్రి ఎంపీగా తాను గెలుపొందానని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం డబ్బులేకపోవడం వల్లనే ఓడిపోయాననే విషయాన్ని ఇప్పటికీ మర్చిపోలేనన్నారు. డబ్బు చుట్టూ తిరిగే రాజకీయాల వల్లనే తాను వాటికి దూరంగా ఉంటూ కళాకారుల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రోదల్బంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. అప్పట్లో కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, కొణిజేటి రోశయ్య వంటి నాయకులు తనను ఎంతగానో ప్రోత్సహించారన్నారు. అనంతరం మహిళా కాంగ్రెస్‌లో పనిచేసినా నేటీ రాజకీయాల్లో ఇమడలేక బయటకు వచ్చినట్టు జమున స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement