మార్చురీలో సౌకర్యాల పెంపుపై దృష్టి
ఏలూరు అర్బన్: ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో నాణ్యమైన చికిత్సలు, వైద్య సేవలు అందించే అంశంతో పాటు మార్చురీలో çకూడా సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ అన్నారు. బుధవారం ఆయన ఆస్పత్రి ఆవరణలోని మార్చురీని పరిశీలించారు. ఫ్రీజర్ బాక్సులు, పీఎం గది, డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. మార్చురీలో ఏ ఇబ్బంది కలిగినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మృతుల కుటుంబసభ్యులతో మానవతా దృక్పథంతో మెలగాలన్నారు.