పెరిగిన వినియోగం | Increased use of power | Sakshi
Sakshi News home page

పెరిగిన వినియోగం

Published Tue, May 30 2017 11:13 PM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

పెరిగిన వినియోగం

పెరిగిన వినియోగం

 ► ఆగనంటున్న మీటర్‌
► భగభగమంటున్న సూర్యుడు
► 24 గంటలూ తిరుగుతున్న పంకాలు, కూలర్లు, వినియోగంలో ఏసీలు
► కోటాకు చేరువలో కరెంట్‌ వాడకం


కోటాకు దరిదాపులో..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు నెల కోటా కింద 298.860 మిలియన్‌ యూనిట్లు కేటాయించారు. అందులో రోజువారీ కోటా 8.910 మిలియన్‌ యూనిట్లు. విద్యుత్‌ వినియోగం పెరగడంతో కేటాయించిన కోటాకు దరిదాపుగా చేరుకుంటోంది. ఎండ తీవ్రతతో గృహావసరాలు పెరగడం ఇందుకు ప్రధా న కారణంగా చెప్పవచ్చు.

రోజురోజుకూ సూరీడు తన ప్రతాపం చూపుతున్నాడు. జనం ఇంటి నుంచి బయటకు వచ్చేం దుకు జంకుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి రక్షించుకునేందుకు ఫ్యాన్లు, కూల ర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. 24 గంటలపాటు ఇవీ తిరుగుతూనే ఉంటున్నాయి. విద్యు త్‌ సరఫరాలో రెప్పపాటు అంతరాయం ఏర్పడినా తట్టుకోలేకపోతున్నారు. ఉష్ణోగ్రతలతోపాటు విద్యుత్‌ విని యోగం పెరిగింది. వేసవికి ముందు కంటే మూడింతలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని జిల్లాకు కేటాయించిన కోటాకు చేరువలో వినియోగం ఉంది. వ్యవసాయ పనులు ముగియడంతో పెద్దగా ఇబ్బందులు     తలెత్తడం లేదు. దీంతో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు.
– కొత్తపల్లి(కరీంనగర్‌)

కొత్తపల్లి(కరీంనగర్‌): వారం రోజులుగా సూర్యుడు నిప్పులు కక్కుతుండడంతో ఉమ్మడి జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తగ్గడం లేదు. రాత్రి వేళల్లోనూ 29 డిగ్రీలు నమోదవుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు కూలర్లు వాడుతుండగా, ఆర్థికంగా స్థిరపడ్డవారు ఏసీలను ఉపయోగిస్తున్నారు. ఫ్యాన్ల విషయం ఇక చెప్పనక్కర్లేదు. వ్యాపార, వాణిజ్య దుకాణాల్లో గతంలో ఫ్యాన్లు నడిచేవి. ఉష్ణోగ్రతలు తీవ్రమవడంతో దుకాణాలు, సూపర్‌మార్కెట్లలోనూ కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. దీంతో గతంతో పోలిస్తే విద్యుత్‌ వినియోగం దాదాపు మూడింతలు పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా
వేసవిలో విద్యుత్‌ వినియోగం పెరుగుతుందని ముందే అంచనా వేసిన అధికారులు తగు జా గ్రత్తలు తీసుకున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకోవడం లేదు. నిమిషం పాటు కూడా కరెంట్‌ పోవద్దన్న ప్రభుత్వ ఆదేశాలను అధికా రులు తూచ తప్పకుండా పాటిస్తున్నారు. అడపాదడపా మరమ్మతులు వస్తున్నప్పటికీ సిబ్బంది సకాలంలో స్పందిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డ దాఖలాలు లేవు.

తగ్గిన వ్యవసాయ వినియోగం
జిల్లాలో గృహ అవసరాలు, పరిశ్రమలు తదితరాలకు చెందిన 9,62,667 కనెక్షన్లు ఉన్నాయి. కేవలం వ్యవసాయానికి సంబంధించి మూడు లక్షల కనెక్షన్లున్నాయి. ప్రస్తుతం రబీ సీజన్‌ ముగియడంతో వ్యవసాయానికి విద్యుత్‌ వినియోగం తగ్గింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా రోజువారీ కోటా 8.910 మిలియన్‌ యూనిట్లుండగా వినియోగం ఇంచుమించు కోటాకు చేరువగా వస్తోంది. రాత్రి వేళల్లో కరెంట్‌ వాడకం ఎక్కువగా ఉంటోంది. అయితే.. వ్యవసాయానికి విద్యుత్‌ వినియోగం తగ్గడం కలిసొచ్చింది. దీంతో అంతరాయం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు.  

ట్రాన్స్‌ఫార్మర్లపై భారం
ఎండ వేడిమిని తట్టుకునేందుకు ప్రజలు ఏసీలు, కూలర్లు ఉపయోగిస్తుండడంతో విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్లు, ఐసోలేటర్లపై తీవ్ర భారం పడుతోంది. ఎండ వేడిమికితోడు వినియోగం ఎక్కువై ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పడుతుండడంతో తరచూ బ్రేక్‌డౌన్‌ అవుతోంది. విద్యుత్‌ సరఫరాను మెరుగుపర్చడం సిబ్బందికి ఇబ్బందిగా మారుతోంది. అందుకే.. మాటిమాటికి ట్రిప్‌ అవుతోంది.  

పరిశ్రమలపై ప్రభావం
గ్రానైట్‌పై విద్యుత్‌ ప్రభావం పడుతోంది. ఎండ వేడిమికి విద్యుత్‌ సమస్య తలెత్తుతుండడంతో యంత్రాలు నిలిచిపోయి అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని చోట్ల గృహావసరాలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. లోఓల్టేజీ, ట్రిప్పవడం వంటి సమస్యలు తరచూ నెలకొంటున్నాయి.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 12,59,702 కనెక్షన్లుండగా, అందులో గృహ అవసరాల విద్యుత్‌ కనెక్షన్లు 8,57,500, వ్యాపార, వాణిజ్య సంస్థలు 78,843, పరిశ్రమలు, రైస్, ఆయిల్‌ మిల్లులు, కాటన్‌ జిన్నింగ్‌ మిల్లులు, తదితర మధ్య తరహా పరిశ్రమలు 8,262, చిన్న తరహా పరిశ్రమలు 3,017, వ్యవసాయ పంప్‌సెట్లు 2,97,035, గ్రామ పంచాయతీ వీధి లైట్లు, మంచినీటి పథకాలు 10,413, పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, వివిధ ప్రార్థనా మందిరాలు 4,632 కనెక్షన్లు ఉన్నాయి.

యాసంగి వరి పంట చేతికి వచ్చి మార్కెట్‌కు తరలడంతో వ్యవసాయపరంగా విద్యుత్‌ వినియోగం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం గృహాలు, వాణిజ్య వినియోగం, కుటీర పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమల వినియోగం పెరిగింది. ఎండల ప్రభావం పరిశ్రమలపై ప్రభావం చూపుతోంది. గ్రానైట్‌ పరిశ్రమకు సంబంధించిన యంత్రాలు నడుస్తుండటంతో ట్రాన్స్‌ఫార్మర్లపై ప్రభావం చూపుతోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement