
బేబీ ఫ్యాక్టరీ @ విశాఖ!
హైదరాబాద్: 'అమ్మ, నాన్న' అనిపించుకోవడం ప్రతి దంపతుల కోరిక. తమ బిడ్డలు నోరారా పిలిస్తే కడుపు నిండినంత సంతోషం ఏ తల్లిదండ్రులకైనా కలుగుతుంది. అంతెందుకు పెళ్లయిన మూడు నెలల నుంచే ఎక్కడికెళ్లినా.. వధువును అడిగి ప్రశ్న ఒక్కటే విశేషమైమేనా ఉందా అని.. అందుకే సమాజంలో పిల్లలంటే ఎంత ప్రేమో, తల్లితండ్రుల హోదా అంటే అంత పిచ్చి. సరిగ్గా ఇదే బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు కొందరు రాక్షసులు.
అది పసిపిల్లల అమ్మకాల వికృత వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారం చేసిన ఎక్స్‌ప్లోజివ్ ఇన్వెస్టిగేషన్‌లో ఈ తతంగాన్ని బట్టబయలైంది. విశాఖలో కొనసాగుతున్న పసిపిల్లల అమ్మకాల వ్యవహారం సాక్షి టీవీ పూర్తి వివరాలతో సహా వెలుగులోకి తెచ్చింది. వాస్తవానికి ఇలాంటి పసిపిల్లల అమ్మకం రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతగమే అయినప్పటికీ విశాఖలో ఈ దారుణాలు వెలుగు చూశాయంతే. ఈ దారుణానికి సంబంధించిన పూర్తి కథనమిది.. వీక్షించండి.