
పసిపిల్లల అమ్మకంపై విచారణకు మంత్రి ఆదేశాలు
సాక్షి మీడియా కథనం 'బేబీ ఫ్యాక్టరీ' పై ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు స్పందించారు.
విజయవాడ: సాక్షి కథనం 'బేబీ ఫ్యాక్టరీ' పై ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు స్పందించారు. కృష్ణా జిల్లా విజయవాడలో మీడియాతో కామినేని మాట్లాడారు. విశాఖలో జరుగుతున్న అరాచకంపై విచారణ జరిపించాలని విశాఖ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీచేశారు. పిల్లల అమ్మకంపై నివేదిక ఇవ్వాలని సీపీ అమిత్ గార్గ్ను మంత్రి కామినేని ఆదేశించారు.
విశాఖపట్నం ఆర్కే బీచ్ ఒడ్డున ఉన్న సంతాన సాఫల్య కేంద్రాలు(ఐవీఎఫ్ సెంటర్లు), వాటి పరిసరాల్లోని అపార్ట్‌మెంట్లలో ప్రతిరోజూ (ఐవీఎఫ్ సెంటర్లు) యథేచ్ఛగా సాగుతున్న అమానవీయ వ్యాపారం.. పిల్లలను అంగడి వస్తువులుగా మార్చేసి అమ్ముతున్న ‘బేబీ ఫ్యాక్టరీ’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించి నిజాలను బయటపెట్టిన విషయం అందరికీ తెలిసిందే.