Kamineni Srinivasa Rao
-
కామినేని జాగ్రత్త !..ఎమ్మెల్యే దూలం వార్నింగ్
-
‘నిమ్మగడ్డ రమేష్ వివరణ ఇవ్వాలి’
సాక్షి, విజయవాడ: ఎన్నికల కమిషనర్ నియామకం వివాదంగా మారి కోర్టుకెక్కిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బీజేపీ నాయకులను ప్రత్యేకంగా కలవడం అనేక అనుమానాలకు తావిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు ఎటువంటి అపోహలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిజాయితీగా ఉండడమే కాదు.. అలా ఉన్నట్టు కూడా వ్యవహరించాలని విమర్శించారు. లేనిపక్షంలో ప్రజల్లో రాజ్యాంగ సంస్థల పట్ల విశ్వసనీయత దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. (హైదరాబాద్ స్టార్ హోటల్లో గూడుపుఠాణి!) ఈ మేరకు బుధవారం మధు మాట్లాడుతూ.. ‘‘ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ల మధ్య సమావేశం జరిగినట్లు వార్త బయటకు వచ్చింది. ఈ అంశంపై ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఈనెల 13న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా భేటీ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఈ సమావేశం జరిగింది. (ఆ ముగ్గురి వ్యాపార లావాదేవీలు ఏమై ఉంటాయబ్బా?) ఇక ఇందుకు సంబంధించిన వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలు, పదవీ కాలాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్, కొత్త ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
కేఎంసీ విద్యార్థుల సత్తా చూపిస్తాం
కర్నూలు(హాస్పిటల్) : ఆందోళనల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపిస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. గత నెలలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఈనెల 6 నుంచి కర్నూలులో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మధ్యలో ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జోక్యం చేసుకుని జూడాలతో చర్చలు జరిపారు. అవి ఫలవంతం కాకపోవడంతో గురువారం నుంచి జూడాలు మెరుపు సమ్మె ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని ఓల్డ్ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై వారు సమాలోచనలు జరిపారు. అనంతరం బయట ఏర్పాటు చేసిన శిబిరం వద్ద సహ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తమతో వెట్టిచాకిరీ చేయిస్తోందని ఆరోపించారు. 6 – 8 నెలలకోసారి ఉపకార వేతనాలు ఇస్తూ తమ సహనాన్ని ప్రతిసారీ పరీక్షిస్తోందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు జీతాలు, అలవెన్సులు పెంచుకోవడంలో ఉన్న ఆసక్తి పేద రోగులకు వైద్యం చేస్తున్న తమ పట్ల లేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే తాము సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని, ఇప్పటికైనా స్పందించకపోతే అత్యవసర విధులను బహిష్కరిస్తామని, ఇందుకు ప్రజలు సహకరించాలని వారు కోరారు. హామీలు నెరవేరలేదు మా డిమాండ్ల పరిష్కారం కోసం గత నెలలో సమ్మెలో వెళ్లేందుకు సిద్ధమై నోటీసులు ఇచ్చాం. ఈ క్రమంలో ఆరోగ్యమంత్రి కామినేని చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారం కోసం హామీలిచ్చారు. 40 రోజులైనా ఆయన ఇచ్చిన హామీలు నెరవేరలేదు. – డాక్టర్ భార్గవ్, కేఎంసీ -
ఫాతిమా విద్యార్థులకు షాక్
-
ఫాతిమా విద్యార్థులకు ‘నీట్’ కోచింగ్!
విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థలో ‘నీట్’ కోచింగ్ ఇప్పిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు చెప్పారు. అలాగే వారు కట్టిన డబ్బులను ఫాతిమా యాజమాన్యంతో తిరిగి ఇప్పిస్తామన్నారు. గురువారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఫాతిమా కాలేజీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మంత్రి కామినేని మీడియాతో మాట్లాడారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు జరిగిన అన్యాయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పాత్ర ఏమీ లేదన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కాలేజీ యాజమాన్యం వల్లే వారికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. నష్టపోయిన విద్యార్థులకు విజయవాడ సమీపంలోని పోరంకిలో ఉన్న నారాయణ క్యాంపస్‌లో ప్రభుత్వ ఖర్చులతో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తామని చెప్పారు. విద్యార్థులంతా సోమవారం ఉదయం 11 గంటలకు పోరంకి నారాయణ క్యాంపస్‌కు రావాలని సూచించారు. కాగా, 108 అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్ విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందిని తొలగించబోమని చెప్పారు. -
పసిపిల్లల అమ్మకంపై విచారణకు మంత్రి ఆదేశాలు
విజయవాడ: సాక్షి కథనం 'బేబీ ఫ్యాక్టరీ' పై ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు స్పందించారు. కృష్ణా జిల్లా విజయవాడలో మీడియాతో కామినేని మాట్లాడారు. విశాఖలో జరుగుతున్న అరాచకంపై విచారణ జరిపించాలని విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీచేశారు. పిల్లల అమ్మకంపై నివేదిక ఇవ్వాలని సీపీ అమిత్ గార్గ్‌ను మంత్రి కామినేని ఆదేశించారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ ఒడ్డున ఉన్న సంతాన సాఫల్య కేంద్రాలు(ఐవీఎఫ్ సెంటర్లు), వాటి పరిసరాల్లోని అపార్ట్మెంట్లలో ప్రతిరోజూ (ఐవీఎఫ్ సెంటర్లు) యథేచ్ఛగా సాగుతున్న అమానవీయ వ్యాపారం.. పిల్లలను అంగడి వస్తువులుగా మార్చేసి అమ్ముతున్న ‘బేబీ ఫ్యాక్టరీ’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించి నిజాలను బయటపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. -
నగదు రహిత వైద్యంపై తొలగని ప్రతిష్టంభన
ఆస్పత్రులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి చర్చలు 3న మళ్లీ భేటీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల నగదు రహిత వైద్య చికిత్సపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా వీడలేదు. దీనిపై ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం తన నివాసంలో చర్చలు జరిపినా ఓ కొలిక్కి రాలేదు. పథకానికి కార్పొరేట్ ఆస్పత్రులు సహకరించాలని మంత్రి కామినేని కోరారు. ప్యాకేజీ రేట్లు, ఓపీ సేవలు, మందుల సరఫరా లాంటి విషయాల్లో తమకు ఇబ్బందులున్నాయని ఈ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రులు ప్రతినిధులు మంత్రికి తెలిపారు. హెల్త్ కార్డులు ఇచ్చినా ఇప్పటికీ నగదు చెల్లించి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోయారు. ఈ నేపథ్యంలో జనవరి 3వ తేదీన మరోసారి సమావేశం నిర్వహించాలని మంత్రి నిర్ణయించారు. జనవరి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పథకం అమలు కావాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలో ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ రమణమూర్తి, రెవెన్యూ ఉడ్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్జీవో విజయవాడ శాఖ అధ్యక్షుడు సాగర్, సహకార శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఫణి పేర్రాజు, యూటీఎఫ్ అధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు తదితరులు మంత్రితో చర్చల్లో పాల్గొన్నారు. వాజ్పాయ్కి భారతరత్నపై హర్షం మాజీ ప్రధాని వాజ్‌పేయి, మదన్మోహన్ మాలవీయలకు భారతరత్న పురస్కారం ప్రకటించడంపై మంత్రి కామినేని హర్షం ప్రకటించారు. -
అలాగైతే అడ్డుకుంటారు: కామినేని
గుంటూరు, విజయవాడ: రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను సమీకరించే పనిని రాజధాని కమిటీ చూసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూ సమీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పాటిస్తుందని ఆశిస్తున్నామని, ఒకవేళ ఇందుకు విరుద్ధంగా జరిగిన పక్షంలో రైతులే భూసేకరణ అడ్డుకుంటారు కదా.. అని అన్నారు. రైతుల ఇబ్బందులను తెలుసుకుని వారిని ఒప్పించిన తర్వాతే టీడీపీ ప్రభుత్వం భూముల సేకరణ జరపాలని కోరుతున్నామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూముల లభ్యతపై ప్రభుత్వం నియమించిన కమిటీ గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తోందని, భూములు ఇచ్చేందుకు ఇష్టం లేని రైతులు కమిటీ ముందు అభిప్రాయాలను బహిరంగంగా చెబుతున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో త్వరలోనే జర్నలిస్టులకు హెల్త్‌కార్డుల జారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలో క్యాన్సర్ వ్యతిరేక సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ త్వరలో విశాఖపట్నంలో టాటా క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు కానుందని, చినకాకాని, కర్నూలు, తిరుపతిలలో కూడా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. -
ప్రభుత్వం వైద్యంపై నమ్మకం పెంచండి:మంత్రి కామినేని
విశాఖ:నగరంలోని కేజీహెచ్(కింగ్ జార్జ్ హాస్పిటల్)పై ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వ వైద్యం బాగుందని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఎక్కడా లేదని దుయ్యబట్టారు. అవినీతిలో కేజీహెచ్ నంబర్ వన్ లో ఉందని ఆయన విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన కామినేని.. ప్రభుత్వం ఆస్పత్రుల్లో వైద్యం సరిగా లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ వైద్యం బాగుందని చెప్పుకునే పరిస్థితి కల్పించి.. సర్కారు వైద్యంపై నమ్మకం పెంచాలని విజ్ఞప్తి చేశారు. మరో మూడు నెలల్లో విమ్స్ తొలివిడత పూర్తవుతుందని కామినేని తెలిపారు. ఇదిలా ఉండగా ఎంసెట్ కౌన్సిలింగ్ పై సుప్రీం కోర్టు తీర్పును మంత్రి స్వాగతించారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం సహకరించి భవిష్యత్తుకు ఇబ్బందిలేకుండా చూడాలన్నారు. కౌన్సిలింగ్ పూర్తి చేయడానికి సహకరించాలని విన్నవించారు. -
పేదలకు మెరుగైన వైద్యం
విశాఖపట్నం : బడుగు, బలహీన వర్గాల ప్రజ లకు మెరుగైన వైద్యం అందించేలా కేజీహెచ్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. అందుకనుగుణంగా కేజీహెచ్‌లో అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్ర కేబినెట్ తొలి సమావేశంలో పాల్గొనేం దుకు నగరానికి వచ్చిన ఆయనను బీజేపీ నేత లు దసపల్లా హిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ బుధవారం కేజీహెచ్, ఘోషా ఆస్పత్రులను స్వయంగా పరి శీలించానన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రారంభోత్సవానికి నోచుకోని విమ్స్ ఆస్పత్రిని ఆరు నెలలోపు ప్రారంభిస్తామని లేదంటే ఎయిమ్స్ సహకారంతో నడుపుతామని మంత్రి హామీ ఇచ్చారు. నగరంలో సూపర్ హాస్పిటల్ ఏర్పాటు విషయం గురించి విలేకరులు ప్రస్తావించగా సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు కన్నా పేదలకు వైద్యం అందించడమే తమకు ముఖ్యమన్నారు. రాష్ట్ర విభజన విషయంలో రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కృషి చేశారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పి.వి. చలపతి రావు, నగర అధ్యక్షుడు పి.వి. నారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.పృథ్వీరాజ్, నాయకులు చెరువు రామకోటయ్య, నరేంద్ర, విమ్స్ ఆస్పత్రి వైద్యుడు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.