అలాగైతే అడ్డుకుంటారు: కామినేని | farmers will oppose acquisition of land, incase of forced | Sakshi
Sakshi News home page

అలాగైతే అడ్డుకుంటారు: కామినేని

Nov 7 2014 4:51 AM | Updated on Jun 4 2019 5:04 PM

అలాగైతే అడ్డుకుంటారు: కామినేని - Sakshi

అలాగైతే అడ్డుకుంటారు: కామినేని

రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను సమీకరించే పనిని రాజధాని కమిటీ చూసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు.

గుంటూరు, విజయవాడ: రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను సమీకరించే పనిని రాజధాని కమిటీ చూసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  భూ సమీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పాటిస్తుందని ఆశిస్తున్నామని, ఒకవేళ ఇందుకు విరుద్ధంగా జరిగిన పక్షంలో రైతులే భూసేకరణ అడ్డుకుంటారు కదా.. అని అన్నారు. రైతుల ఇబ్బందులను తెలుసుకుని వారిని ఒప్పించిన తర్వాతే టీడీపీ ప్రభుత్వం భూముల సేకరణ జరపాలని కోరుతున్నామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూముల లభ్యతపై ప్రభుత్వం నియమించిన కమిటీ గ్రామాల్లో  సదస్సులు నిర్వహిస్తోందని, భూములు ఇచ్చేందుకు ఇష్టం లేని రైతులు కమిటీ ముందు అభిప్రాయాలను బహిరంగంగా చెబుతున్నారని అన్నారు.

 

సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో త్వరలోనే జర్నలిస్టులకు హెల్త్‌కార్డుల జారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలో క్యాన్సర్ వ్యతిరేక సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ త్వరలో విశాఖపట్నంలో టాటా క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు కానుందని, చినకాకాని, కర్నూలు, తిరుపతిలలో కూడా క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement