దుబ్బాక: నగర పంచాయతీ పరిధిలోని డ్వాక్రా సంఘాలకు 25 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని మెప్మా కో-ఆర్డినేటర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ యూనిట్లకు నేడు(శుక్రవారం) సాయంత్రం 3 గంటలకు నగర పంచాయతీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
25 యూనిట్లలో ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున వ్యక్తిగత రుణాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇందులో ఏపీజీవీబీ చిట్టాపూర్ బ్రాంచ్‌లో 5 యూనిట్లకు రూ. 10 లక్షలు, ఏపీజీవీబీ దుబ్బాక శాఖకు 10 యూనిట్లకు రూ. 20 లక్షలు, ఎస్‌బీహెచ్ దుబ్బాక శాఖకు 10 యూనిట్లకు రూ. 20 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు.
ఆసక్తి గల స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యక్తిగత దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, డ్వాక్రా సంఘం బ్యాంకు పాసు పుస్తకం, స్లమ్ సమాఖ్య తీర్మాన కాపీలు తీసుకొని సాయంత్రం 5 గంటలకు నగర పంచాయతీ కార్యాలయంలో హాజరు కావాలని కోరారు.