డీఆర్వో భాస్కర్‌కు వినతిపత్రం ఇస్తున్న ఇరిగేషన్ ఉద్యోగులు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: రాజీవ్‌గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఫేజ్–1 ట్రయల్‌రన్ సందర్భంగా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ ఖగేందర్‌పై దాడికి నిరసనగా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు బుధవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విధులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి పట్టణంలో భారీర్యాలీ నిర్వహించారు. అశోక్‌టాకీస్ చౌరస్తా వద్ద ఉన్న జలసౌధ నుంచి క్లాక్‌టవర్, తెలంగాణ చౌరస్తా మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని డీఆర్వో భాస్కర్‌కు వినతిపత్రం అందజేశారు. సీఈపై దాడిచేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్‌చేయాలని డిమాండ్‌చేశారు. ఇంజనీరింగ్ అధికారులను బెదిరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. విధినిర్వహణలో ఇరిగేషన్ అధికారులకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు రామకష్ణారావు, ఇరిగేషన్ అధికారులు నర్సింహ, భీమన్న, చంద్రానాయక్‌లతో పాటు చిన్న, భారీ నీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.