CE
-
‘సీతారామ’పై ఈఎన్సీ, సీఈకి షోకాజ్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పరిపాలనా అనుమతులు లేకుండానే సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు టెండర్లను ఆహ్వనించిన అంశంపై మంత్రుల సమక్షంలో వాగ్వాదానికి దిగినందుకు నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ (సీఈ) శ్రీనివాస్‌రెడ్డికి ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దుష్ప్రవర్తన, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకు సంజాయిషీ ఇవ్వాలని వారిని ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత శనివారం సీతారామ ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో పాలనా అనుమతుల్లేకుండానే అధికారులు టెండర్లను ఆహ్వనించిన అంశం చర్చకు రావడం తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం సీఈ ఎ.శ్రీనివాస్‌రెడ్డే అనుమతుల్లేకుండా టెండర్లు ఆహ్వనించారని అనిల్‌కుమార్ అభ్యంతరం తెలిపినట్లు.. అనుమతుల విషయంలో అనీల్కుమారే సహకరించట్లేదని శ్రీనివాస్‌రెడ్డి మంత్రుల సమక్షంలో వాదించినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ వారిద్దరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను అదే రోజు ఆదేశించారు.మంత్రులను తప్పుదోవ పట్టించినందుకు సస్పెండ్ చేయిస్తానని సీఈపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ వ్యవహారం గురించి సాక్షి ప్రధాన సంచికలో ‘అనుమతి లేకున్నా రూ. వెయ్యి కోట్ల సీతారామ టెండర్లు’శీర్షికతో వచ్చిన వార్తా కథనంపై కొత్తగూడెం సీఈ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం వివరణ ఇచ్చారు. సీఎం, మంత్రులు ఆదేశించడంతోనే డి్రస్టిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు టెండర్లను ఆహ్వానించినట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్‌తోపాటు నీటిపారుదల శాఖ కార్యదర్శి, ఈఎన్సీ (జనరల్)కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. డి్రస్టిబ్యూటరీల పనులకు తక్షణమే టెండర్లను ఆహ్వనించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు రెండో పంప్‌హౌస్ వద్ద నిర్వహించిన సమీక్షలో ఆదేశించారని గుర్తుచేశారు.అలాగే సెపె్టంబర్ 27న నిర్వహించిన సమీక్షలో డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు టెండర్లు పిలవాలని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఆదేశించారని పేర్కొన్నారు. రూ.13,057.98 కోట్ల సవరణ అంచనాలతో గతంలో ఇచ్చిన పరిపాలనా అనుమతుల్లో డిస్ట్రిబ్యూటరీల పనులు సైతం ఉన్నందున టెండర్ల విషయంలో ముందుకు వెళ్లాలని ఆ సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ సూచించారన్నారు. ఆ సమావేశం మినట్స్‌లో ఈ విషయాలన్నీ ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రాజెక్టు వ్యయ అంచనాల సవరణకు పరిపాలనా అనుమతులు వస్తాయన్న నమ్మకంతోనే డిస్ట్రిబ్యూటరీల పనులకు తాజాగా టెండర్లను ఆహ్వానించినట్లు లేఖలో పేర్కొన్నారు. -
ఒకే గొడుగు కిందకు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జల వనరుల శాఖ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయింది. గత కొన్ని నెలలుగా దీనిపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం పునర్ వ్యవస్థీకరణ ముసాయిదాపై ఇంజనీర్లతో మరోమారు చర్చించి ఫైనల్ చేశారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న మేజర్, మీడియం, మైనర్, ఐడీసీ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు నిర్వహించే కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపిన అనంతరం ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. జల వనరుల శాఖ పునర్ వ్యవస్థీకరణపై శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్‌తో పాటు ఈఎన్ సీలు మురళీధర్, నాగేంద్రరావు, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే హాజరయ్యారు. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, ఆయకట్టు పెరిగినందున క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్ ఇంజనీర్ల డివిజన్లను 19కి పెంచేందుకు సీఎం నిర్ణయించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రామగుండం, వరంగల్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, హైదరాబాద్ కేంద్రాలుగా సీఈ డివిజన్లు కానున్నాయి. ఈ సీఈల పరిధిలోనే ప్రాజెక్టులు, చెరువులు, ఐడీసీ లిఫ్టులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్‌హౌస్ లు, కాల్వలు, సబ్స్టేషన్లు ఉండనున్నాయి. ఒక్కో సీఈ పరిధిలో 5 లక్షల ఎకరాల నుంచి 7లక్షల ఎకరాలు ఉండేలా పని విభజన చేశారు. మహబూబ్‌నగర్ సీఈగా అంజయ్య.. ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్న పలు సీఈలు, ఈఈల స్థానంలో కొత్త వారికి బాధ్యతలు కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మహబూబ్‌నగర్ సీఈగా అనంతరెడ్డి స్థానంలో ఎస్ఈ అంజయ్యకు పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టగా, మైనర్ ఇరిగేషన్ గోదావరి బేసిన్ సీఈగా ఉన్న వీరయ్య స్థానంలో సీడీఓ సీఈ శ్రీనివాస్‌కు బాధ్యతలు ఇచ్చింది. అంతర్రాష్ట్ర జల వనరుల విభాగంలో పనిచేస్తున్న ఇన్చార్జి ఈఈ కోటేశ్వర్రావు పదవీకాలాన్ని పొడిగించగా, మరో ఆరుగురు ఈఈల స్థానంలో కొత్తవారిని నియమించింది. మొత్తంగా ఆరుగురు ఈఎన్సీలు.. మైనర్ ఇరిగేషన్ కింద ఇది వరకు కృష్ణా, గోదావరి బేసిన్ లలో విడివిడిగా ఉన్న సీఈల పోస్టులను రద్దు చేశారు. ఈ సీఈలతో పాటు మొత్తంగా ఆరుగురు ఈఎన్ సీలు ఉండనున్నారు. ఇందులో ఒకరు ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ బాధ్యతలు చూడనున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణను కేబినెట్ ముందు పెట్టి, దీని అవసరాన్ని ముఖ్యమంత్రి వివరించనున్నారు. అక్కడ ఆమోదం పొందిన అనంతరం దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. ఇదే అంశమై అసెంబ్లీలోనూ ఒక ప్రకటన చేయాలని ఇప్పటికే సీఎం నిర్ణయించారు. -
ఐడీసీ ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి కావస్తుండటం.. అదే సమయంలో కాల్వలు, పంపులు, పంప్‌హౌస్‌లు, బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్వహణ కత్తిమీద సాములా మారనున్న తరుణంలో పలు విప్లవాత్మక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సాగునీటి శాఖను పూర్తిగా పునర్వ్యవస్థీకరించేందుకు సిద్ధమయ్యారు. భారీ, మధ్యతరహా, చిన్నతరహా అనేది లేకుండా అన్నింటినీ ఒకే గూటి కిందకు తేవాలని, ఇప్పటివరకు ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న రాష్ట్ర సాగునీటి అభివృధ్ధి సంస్థ (ఐడీసీ)ని పూర్తిగా ఎత్తివేయాలనే ఆలోచనలో ఉన్నారు. భవిష్యత్తుకు దిక్సూచిగా ప్రక్షాళన.. ప్రస్తుతం సాగునీటి శాఖలో ఐదుగురు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)లు ఉన్నారు. వారికి అదనంగా మరో ఇద్దరు, ముగ్గురు ఈఎన్సీలను పెంచి వారి పరిధిలోకి నాలుగేసి జిల్లాల సర్కిళ్లను తేనున్నారు. ఒక్కో సర్కిల్‌కు చీఫ్ ఇంజనీర్‌ను నియమించి వారి కిందే జిల్లాకు సంబంధించిన భారీ, మధ్యతరహా, చిన్ననీటి, ఐడీసీ పథకాల పనులన్నింటినీ తేవాలని సీఎం సూచించారు. ప్రస్తుతం పాలమూరు జిల్లాను తీసుకుంటే జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి ప్రాజెక్టులకు ఒక సీఈ, మైనర్ వ్యవహారాలు చూసేందుకు మరో సీఈ, ఐడీసీ పథకాలకు మరో సీఈ ఉన్నారు. అయితే అలా కాకుండా జిల్లాకు సంబంధించిన అన్ని విభాగాల పనులు ఒక్క సీఈ కిందకే తేవాలన్నది సీఎం ఉద్దేశంగా ఉంది. దీని ద్వారా జిల్లాకు సంబంధించిన సమగ్ర సమాచారం ఒక్కరి వద్దే నిక్షిప్తంగా ఉంటుందని, నిర్ణయాలు సైతం ఒక్కరే తీసుకుంటారని, నిధుల ఖర్చు సులువుగా ఉంటుందని ఇటీవల సమీక్ష సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంగా ఐడీసీని పూర్తిగా ఎత్తివేయాలని సూచించారు. 10 వేల ఎకరాల వరకు సాగునీటిని అందించేలా ఐడీసీ ద్వారా ఎత్తిపోతల పథకాలు చేపడుతుండగా ప్రస్తుతం ప్రభుత్వం భారీ ఖర్చుతో ప్రాజెక్టులు చేపడుతున్నందున ఐడీసీ ప్రత్యేకంగా అక్కర్లేదన్నది సీఎం అభిప్రాయమని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం సూచనల మేరకు పలు విభాగాలను సమీకృతం చేసేలా సాగునీటి శాఖ కసరత్తు ప్రారంభించింది. దీనిపై ఇంజనీర్లకు మార్గదర్శనం కోసం ఈ నెల 21, 22 తేదీల్లో వర్క్‌షాప్ నిర్వహించనుంది. ఈ మేరకు అందరికీ సమాచారం పంపింది. ఇందులో ఏదో ఒకరోజు వర్క్‌షాప్‌నకు సీఎం హాజరయ్యే అవకాశం ఉంది. ఓ అండ్ ఎంకుపాలసీ.. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం)కు ప్రత్యేక పాలసీని రూపొందించాలని సీఎం నిర్ణయించారు. నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చూడాలని, దీనికి ప్రత్యేక బడ్జెట్ ఉండాలని సూచించారు. ఆయన సూచనల మేరకు ఎత్తిపోతల పథకాల పరిధిలో పంప్‌హౌస్‌లలోని పంపులు, మోటార్లు, విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, రిజర్వాయర్, బ్యారేజీల గేట్లు, కాల్వలు, టన్నెళ్లు నిర్వహణ ఓ అండ్ ఎం కిందకే తేనున్నారు. వాటి నిర్వహణ ఖర్చును ఆయా జిల్లా బాధ్యతలు చూసే ఈఎన్సీ, సీఈలు పర్యవేక్షించేలా బాధ్యతలు అప్పగించనున్నారు. ఓ అండ్ ఎంకు అవసరమయ్యే ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, ఇతర సిబ్బంది అవసరాలపై ప్రాజెక్టులవారీగా లెక్కలు తీసి నిర్ణీత సిబ్బంది నియామకాలు చేపట్టే బాధ్యతలను కట్టబెట్టనున్నారు. -
22న మూడు రాష్ట్రాల సీఈల భేటీ
సాక్షి, హైదరాబాద్:రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) కాల్వల ఆధునికీకరణ పనుల అంశంలో మళ్లీ కదలిక వచ్చింది. వీటిని పూర్తి చేయాలని గత నెలలో జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వాదించిన నేపథ్యంలో దీనిపై 3 రాష్ట్రాల ఉమ్మడి సమావేశం జరపా లని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల చీఫ్ ఇంజనీర్లతో కలిపి హైదరాబాద్‌లో ఈ నెల 22న సీడబ్ల్యూసీ కార్యాలయంలో ఈ భేటీ జరపనుంది. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుం చి 7టీఎంసీలు, పరీవాహకం నుంచి మరో 8 టీఎంసీల మేర లభ్యమవుతోంది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ ఆన కట్ట పొడవును మరో 5అంగుళాలు పెంచాలని నిర్ణయించగా, కర్ణాటక సైతం అంగీకరించింది. ఈ కాల్వల ఆధునికీకరణకు కర్ణాటకకు రాష్ట్రం రూ.92.74కోట్లు డిపాజిట్ సైతం చేసింది. ఇందులో ప్యాకేజీ–1 పనులను 24%, ప్యాకేజీ–2పనులను మరో 54% వరకు పూర్తి చేసింది. ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునికీకరణ పనులకు అడ్డు తగులుతుండటంతో అవి నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రానికి ఏటా 4 టీఎంసీలు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల ఉమ్మడి భేటీని ఈ నెల 22న జరిపేందుకు సీడబ్ల్యూసీ నిర్ణయించింది. -
ఏసీబీ వలలో అవినీతి చేప
సాక్షి, పాల్వంచ: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) 5,6 దశల చీఫ్ ఇంజ నీర్ కె.ఆనందం ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఎసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. గురువారం మధ్యా హ్నం 12.45 నిమిషాలకు ఏసీబీ డీఎస్పీ ప్రతా ప్ ఆధ్వర్యంలో సిబ్బంది చేపట్టిన ఆపరేషన్‌లో రూ.3లక్షల నగదు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఏకకాలంలో సీఈ కార్యాలయంతో పాటు ఆయన నివాసం ఉండే జెన్కో గెస్ట్‌హౌస్‌లోనూ సోదాలు చేశారు. డీఎ స్పీ ప్రతాప్ కథనం ప్రకారం.. కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో మెటీరియల్æ(మిషనరీ స్పేర్ పార్ట్స్) సప్లయ్ కాంట్రాక్ట్‌ను పాల్వంచకు చెందిన వాహిని ఇంజనీరింగ్ సర్వీసెస్ కాంట్రాక్టర్ లలిత్ మోహన్ నిర్వహిస్తున్నాడు. గత జూ లైలో టెండర్లకు నోటిఫికేషన్ ఇవ్వగా, అదే నెల చివరి వారంలో 21 రకాల పనులను రూ.71లక్షలకు దక్కించుకున్నాడు. మెటీరియల్ సప్లయ్ చేసినందుకు 7 పనులకు రూ.28లక్షల బిల్లులు ఇచ్చారు. మిగిలిన రూ.43లక్షల బిల్లులు చేయా ల్సిఉంది. ఈక్రమంలో ఈనెల 1న సీఈ ఆనం దం కాంట్రాక్టర్ లలిత్ మోహన్‌ను పిలిపించి టెండర్ల బిల్లులు చేసినందుకు తనకు రూ.10 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే వర్క్ ఆర్డర్‌ను రద్దు చేసేలా చూస్తానని బెదిరించాడు. దీంతో లలిత్ మోహన్ రూ.2లక్షల లంచం ఇచ్చాడు. మరో రూ.3లక్షలు 10వ తేదీన ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్.. మెటీరియల్ సప్లయ్ పనుల్లో తనకు వచ్చే లాభం డబ్బును సీఈ అడగడంతో లలిత్ మోహన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఖమ్మం డీఎస్పీ ప్రతాప్ సూచనల మేరకు రూ.3లక్షలు తీసుకుని సీఈ కె.ఆనందంకు గురువారం అందించాడు. కాగా, ముందస్తు పధకం ప్రకారం అక్కడికి వచ్చిన డీఎస్పీ ప్రతాప్, సీఐలు రవి, రమణమూర్తి, పీఆర్ ఏఈ ఇర్ఫాన్, సీనియర్ అసిస్టెంట్ కె.వి.రాఘవేందర్, మరో పది మంది సిబ్బంది కలిసి ఆనందం లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సీఈని అదుపులోకి తీసుకుని, శుక్రవారం హైదరాబాద్ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఏకకాలంలో సోదాలు.. సీఈ కార్యాలయంలో అతడిని పట్టుకోవడంతో పాటు జెన్కో కాలనీలో సీఈ నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్‌లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన కంప్యూటర్లో ఉన్న వివరాలను సైతం పరిశీలించారు. ఏసీబీ అధికారుల సోదాలతో ఒక్కసారిగా కేటీపీఎస్ కాంప్లెక్స్‌లోని ఉద్యోగుల్లో కలకలం రేపింది. ప్రజాహిత బ్రహ్మకుమారీస్ సంస్థ కీలక బాధ్యుడిగా, కర్మాగారంలో నిత్యం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న సీఈ లంచావతారంలో దొరకడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కర్మాగారంలో కార్మికులకు సైతం ఆధ్యాత్మిక పుస్తకాలు, కరపత్రాలు, జ్ఞాపికలు పంపిణీ చేయడం, వారికి దైవ సూక్తులు బోధించడం వంటి పనులు చేసే వ్యక్తి ఇలా చేయడం ఏంటని చర్చించుకుంటున్నారు. ఇబ్బంది వల్లే ఏసీబీని ఆశ్రయించా కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో మెటీరియల్ సప్లయ్ చేసేందుకు రూ.71లక్షల పనులను టెండర్ల ద్వారా దక్కించుకున్నాం. 7 పనులకు రూ.28లక్షల బిల్లులు చేశారు. మిగిలిన రూ.43లక్షల బిల్లులకు సీఈ రూ.10లక్షలు లంచం అడిగాడు. లేదంటే మిగితా బిల్లులు ఆపేస్తానని, భూపాలపల్లిలో కూడా బిల్లులు రాకుండా చేస్తానని బెదిరించాడు. ఈ పనులన్నీ గత సీఈ టీఎస్ఎన్ మూర్తి హయాంలోనే నాకు దక్కాయి. 15 సంవత్సరాలుగా నేను పనులు చేస్తున్నా.. ఏనాడూ ఏ అధికారీ డబ్బులు అడగలేదు. ఇప్పుడు సీఈ ఆనందం పెద్ద మొత్తంలో అడగడం ఇబ్బంది కలిగించింది. అందుకే ఏసీబీ వారిని ఆశ్రయించా. – లలిత్ మోహన్, కాంట్రాక్టర్ లంచం అడిగితే 1064కు కాల్ చేయండి ఎవరైనా ప్రభుత్వ అధికారులు లేదా సిబ్బంది లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయండి. ఈ నంబర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఫోన్ చేసిన బాధితులకు తప్పక సహకరిస్తాం. అవసరమైతే వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవినీతికి పాల్పడితే ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదు. – ప్రతాప్, ఏసీబీ డీఎస్పీ -
వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంకండి
–ఇరిగేషన్ యంత్రాంగానికి సీఈ పిలుపు ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్): వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని ఇరిగేషన్ యంత్రాంగానికి గోదావరి డెల్టా సీఈ వారా వీర్రాజు పిలుపునిచ్చారు. బుధవారం ధవళేశ్వరం సీఈఆర్పీ గెస్ట్‌హౌస్‌లో ఫ్లడ్ మీటింగ్‌ను హెడ్‌వర్క్స్ ఈఈ ఎన్.కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా వీర్రాజు, ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ బి.రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈ వీర్రాజు మాట్లాడుతూ వరదలను ఎదుర్కొనేందుకు ఇరిగేషన్ యంత్రాంగం అంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న ఇబ్బందులను తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ బి.రాంబాబు మాట్లాడుతూ వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. కాటన్‌బ్యారేజ్ వద్ద ప్రమాద హెచ్చరికలు జారీచేసినప్పుడు ముంపునకు గురిఅయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అప్రమత్తంగా ఉండాలన్నారు. హెడ్‌వర్క్స్ ఈఈ ఎన్.కృష్ణారావు మాట్లాడుతూ బలహీనంగా ఏటిగట్ల వద్ద రక్షణ చర్యలను చేపడతామన్నారు. కూళ్ళ, సుందరపల్లి, ప్రాంతాల్లో తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టాల్సి వుందన్నారు. జిల్లాలో బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించామని వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఫ్లడ్స్టోర్స్కు సంబంధించి మెటిరీయల్స్‌కు ఇప్పటికే టెండర్స్‌ను ఖరారు చేశామని ఈ నెలాఖరు నాటికి అన్ని ఫ్లడ్స్టోర్స్లోను సామగ్రిని పూర్తిస్థాయిలో ఉంచుతామన్నారు. షట్టర్ల నిర్మాణం జరగాల్సిన ఉన్నచోట్ల తాత్కాలిక రక్షణచర్యలను చేపడతామన్నారు. కార్యక్రమంలో తూర్పు డివిజన్ఈఈ అప్పలనాయుడు, సెంట్రల్ డివిజన్ ఈఈ సుధాకర్, పలువురు డీఈ, ఏఈలు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలి
భీమవరం టౌ¯ŒS : విచిత్ర జాతిని విద్యావ్యవస్థ సృష్టిస్తుంటే విద్యార్థి సంఘాలు చూçస్తూ ఊరుకోవంటూ హా¯Œ్స ఇండియా చీఫ్ ఎ డిటర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. భీమవరం ఏఎస్ఆర్ సాంస్కృతిక కేంద్రంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ 21వ మహాసభల్లో భాగంగా శుక్రవారం ముఖ్య అతిథిగా నాగేశ్వర్ మాట్లాడారు. విద్యాసంస్థలు సమాజం గురించి ఆలోచించే మెదళ్లను తయారు చేయలేనప్పుడు విద్యార్థి సంఘాలు ఆ బాధ్యతను తీసుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు విద్యారంగంలో వెనుకబడ్డాయన్నారు. బలమైన ప్రజా ఉద్యమా లు, సామాజికాభివృద్ధి ద్వారానే విద్యారంగం ప్రగతి సాధిస్తుందని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చే ప్రతి చర్యనూ సమర్థిస్తామని, ఇందుకు విరుద్ధమైన ప్రతి చర్యనూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చా రు. పాలకులు విద్యాహక్కు చట్టాన్ని కూ డా నీరుగార్చుతున్నారని ఆందోళన వ్యక్త ం చేశారు. ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటు విద్యావ్యాప్తికి దోహదపడదన్నారు. దాడులను ప్రశ్నించకూడదా..! సింగపూర్, చైనా, జపాన్, అమెరికాలను చూసి నేర్చుకోవాలని చెబుతున్న ముఖ్యమంత్రి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉందని నాగేశ్వర్ అన్నారు. యూనివర్సిటీలు ఎలా ఉన్నాయనడానికి వేముల రోహిత్, కన్హయ్య సంఘటనలు అద్దం పడుతున్నాయన్నారు. దాడులను విద్యార్థులు ప్రశ్నించకూడదనే భావనలో పాలకులు ఉన్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా బ్యాంకుల ముందు జనం బారులు తీరి ఉంటుండగా ఈ విషయంపై ఉస్మానియా వర్సిటీలో ఒక్క సదస్సు కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. విద్యావిధానంలో, విద్యా సమాజంలో మార్పునకు విద్యార్థి సంఘాలు నిరంతర కృషి చేయాలని పిలుపునిచ్చారు. మేధావులను తయారు చేసే కేంద్రంగా విశ్వవిద్యాలయాలు ఉండాలని ఆకాంక్షించారు. పేదలకు ఉన్నత విద్య దూరం ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ఉన్నత విద్యను పేద విద్యార్థులకు దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు మ తోన్మాదులకు నిలయాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ పోరాటాలు ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. ఆం ధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు మూతపడుతున్నాయని చెప్పారు. విద్యారంగ పరిరక్షణకు ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేస్తోందని తెలిపారు. ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్రమ్‌సింగ్, జాతీయ మాజీ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, ఉపాధ్యక్షుడు పి.రవికుమార్, మంతెన సీతారాం, కె.హరికిశోర్, బి.సాంబశివ, పి.తులసి, ఎల్.చిన్నారి, కె.మహేష్, రాజు, పి.కిరణ్, ఎంవీ రమ ణ, ఎ.అశోక్, కె.ఆంజనేయులు, కె.క్రాం తి తదితరులు పాల్గొన్నారు. -
సీఈ బాధ్యతల స్వీకరణ
కర్నూలు సిటీ: జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు చీఫ్ ఇంజనీర్‌గా సి.నారాయణ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు సీఈగా పని చేస్తున్న చిట్టిబాబు గత నెల 31న పదవి విరమణ కావడంతో హైదరాబాదులో చీఫ్ టెక్నికల్ అధికారిగా పని చేస్తున్న నారాయణ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రాజెక్ట్సు సీఈగా నియమించింది. ఈయన స్వస్థలం చిత్తూరు జిల్లా. ఈ మేరకు ఆయన బాధ్యతలు తీసుకునేందుకు ఆఫీస్‌కు రాగా సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం...పుష్కర పనుల పరిశీలనకు శ్రీశైలం వెళ్లారు. -
ఇరిగేషన్ సీఈపై దాడికి నిరసనగా ర్యాలీ
మహబూబ్‌నగర్ న్యూటౌన్: రాజీవ్‌గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఫేజ్–1 ట్రయల్‌రన్ సందర్భంగా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ ఖగేందర్‌పై దాడికి నిరసనగా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు బుధవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విధులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి పట్టణంలో భారీర్యాలీ నిర్వహించారు. అశోక్‌టాకీస్ చౌరస్తా వద్ద ఉన్న జలసౌధ నుంచి క్లాక్‌టవర్, తెలంగాణ చౌరస్తా మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని డీఆర్వో భాస్కర్‌కు వినతిపత్రం అందజేశారు. సీఈపై దాడిచేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్‌చేయాలని డిమాండ్‌చేశారు. ఇంజనీరింగ్ అధికారులను బెదిరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. విధినిర్వహణలో ఇరిగేషన్ అధికారులకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రామకష్ణారావు, ఇరిగేషన్ అధికారులు నర్సింహ, భీమన్న, చంద్రానాయక్‌లతో పాటు చిన్న, భారీ నీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. -
సీఈపై బదిలీ వేటు
పంతం నెగ్గించుకున్న కమిషనర్ డిప్యుటేషన్‌పై ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీకి జీతభత్యాలు మాత్రం జీవీఎంసీలోనే.. కమిషనర్‌పై ఫైర్.. తేల్చుకుంటానన్న సీఈ కోల్డ్‌వార్‌కు ఎట్టకేలకు తెరపడింది. సీఈపై బదిలీ వేటు పడింది. కమిషనర్‌దే పైచేయి అయ్యింది. కొంతకాలంగా ఈయన బదిలీపై వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ బదిలీ ఉత్తర్వులు అందాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.కరికాల వలవెన్‌కు సాంకేతిక సలహాదారుగా సీఈ దుర్గాప్రసాద్‌ను డిప్యుటేషన్‌పై నియమించారు. జీతభత్యాలు మాత్రం జీవీఎంసీలోనే తీసుకునేలా ఆదేశాలిచ్చారు. ఇంజనీరింగ్ విభాగంలో సీనియరైన సూపరింటెండింగ్ ఇంజనీర్(వర్క్స్) చంద్రయ్యకు సీఈగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. విశాఖపట్నం: జీవీఎంసీలో కమిషనర్ ప్రవీణ్‌కుమార్, సీఈ దుర్గాప్రసాద్‌ల మధ్య గత కొంతకాలంగా విభేదాలున్నాయి. పలు అంశాల్లో తలెత్తిన ఈ విభేదాలు ఆధిపత్యపోరుకు తెరతీశాయి. చీఫ్ ఇంజనీరింగ్‌గా దుర్గాప్రసాద్ 2014 నవంబర్ 14న జీవీఎంసీకి రాగా 2015 ఫిబ్రవరిలో కమిషనర్‌గా ప్రవీణ్‌కుమార్ వచ్చారు. ఆదిలో సఖ్యతగానే మెలిగిన వీరిద్దరి మధ్య తర్వాత ఆధిపత్యపోరు మొదలైంది. జీవీఎంసీలో తాను ఎవరి కిందా పనిచేయడం లేదని.. ఎవరి ఆదేశాలు పాటించనవసరం లేదంటూ సీఈ తరచూ కమిషనర్‌పై ఒంటికాలిపై లేచేవారనే విమర్శలున్నాయి. వివిధ పనులకు సంబంధించి టెండర్ల ఖరారు సమయంలో కూడా ఏకపక్షంగానే నిర్ణయాలు తీసుకోవడం, వద్దన్న పనులు చేస్తుండడంతో సీఈ, కమిషనర్ల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అప్పటి నుంచి ఇంజినీరింగ్ సెక్షన్లో ఏ పనికైనా సరే కమిషనర్ సంబంధిత సూపరింటెంటెండింగ్ ఇంజనీర్లతో మాట్లాడేవారే తప్ప సీఈతో మాట్లాడటం దాదాపు మానేశారు. ఏడాదిగా మరింత ముదిరి.. గత ఏడాదిగా ఈ విభేదాలు మరింత ముదిరి.. కోల్డ్‌వార్‌గా మారింది. ఈ తరుణంలోనే మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారంటూ బీచ్‌రోడ్‌లోని రాజీవ్ స్మృతి భవన్‌ను కోట్ల రూపాయలు ఖర్చుచేసి నేదునూరి కృష్ణమూర్తి స్మారక మందిరంగా సీఈ దుర్గాప్రసాద్ తీర్చిదిద్దారు. తనకు చెప్పకుండా ఎలా చేస్తారంటూ అప్పట్లో కమిషనర్ సీఈపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ఏలేరు నీటిపంపింగ్ కోసం టెండర్లు పిలవగా సింగిల్ టెండరే దాఖలైనప్పటికీ కనీసం కమిషనర్‌కు చెప్పకుండా కమిటీ కూర్చొని ఫైనలైజ్ చేసేందుకు యత్నించగా విషయం తెలుసుకున్న కమిషనర్ వెంటనే ఆపేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ తర్వాత చీఫ్ ఇంజనీర్ పోస్ట్ జీవీఎంసీలోనే ఉందని.. ఈఎన్సీ తర్వాత పోస్ట్‌లో ఉన్న తనకు కనీస గౌరవం ఇవ్వకుండా.. కలుపుకొని పోకుండా కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సీఈ కూడా తరచూ ఆవేదనకు గురయ్యేవారు. ఈ నేపథ్యంలో చీఫ్ ఇంజనీర్‌పై ఫిర్యాదుల వెల్లువెత్తడంతో పాటు బదిలీ చేసేందుకు ఉన్నత స్థాయిలో మమ్మర ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒక దశలో సీఈని సరెండర్ చేసేందుకు కమిషనర్ తీవ్రంగానే ప్రయత్నించారన్న వార్తలు కూడా వచ్చాయి. స్మార్ట్‌సిటీగా ఎంపికైన విశాఖలో వందల కోట్ల పనులు జరుగనున్న నేపథ్యంలో అధికారుల మధ్య కోల్డ్‌వార్ మంచిది కాదన్న వాదన కూడా బలంగానే విన్పించింది. తనపై బదిలీ వేటు పడకుండా సీఈ తీవ్రంగానే ప్రయత్నించినప్పటికీ ఈ నెల 15న కమిషనర్ మరో లేఖ రాశారు. చీఫ్ ఇంజనీర్‌ను బదిలీ చేయాలని, ఖాళీగా ఉన్న సీఎంహెచ్వో పోస్ట్‌ను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో 24 గంటల్లో వస్తున్న సమయంలో సీఈని బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం జీవీఎంసీలో చర్చనీయాంశమైంది. కాగా ఇప్పటికే సీఎంహెచ్వో పోస్ట్ ఖాళీగా ఉండగా తాజాగా సీఈ పోస్టు కూడా ఖాళీ అయ్యింది. ప్రిన్సిపల్ సెక్రటరీది ఏకపక్ష నిర్ణయం కమిషనర్ ప్రవీణ్‌కుమార్ లేఖపై ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల వలవెన్ ఎలాంటి విచారణ జరపకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. దీన్ని బట్టి బ్రిటీష్ పాలనలో ఉన్నామా? .. స్వతంత్ర భారతంలో ఉన్నామా? అన్న అనుమానం నాకు కలుగుతోంది. మున్సిపల్ శాఖలో ఏకైక చీఫ్ ఇంజనీర్ నేనే. సెక్రటరీ స్థాయిలో లాబీయింగ్ జరిపి నిబంధనలకు విరుద్ధంగా నాకంటే జూనియర్ అయిన జయరామిరెడ్డిని జీవీఎంసీలో సీఈగా గతంలో కొనసాగించారు. అదేవిధంగా మరోసారి నాకంటే జూనియర్ అధికారికి అందలం ఎక్కించేందుకు కమిషనర్ ప్రవీణ్‌కుమార్ సెక్రటేరియట్ స్థాయిలో లాబీయింగ్ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. నేను వచ్చి ఏడాదిన్నరే అయ్యింది. కనీసం ఐదేళ్ల వరకు ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది. కమిషనర్ వైఖరిపై ఇదివరకే ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేశా. -ఎన్.దుర్గాప్రసాద్, చీఫ్ ఇంజనీర్, జీవీఎంసీ -
సంపన్నుల జాబితాలో ఆరో స్థానంలో జుకర్‌బర్గ్