ప్రజాస్వామ్యంలో చీకటిరోజు | its a black day says reddy santhi | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యంలో చీకటిరోజు

Published Sat, Sep 10 2016 11:26 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

మాట్లాడుతున్న రెడ్డి శాంతి - Sakshi

మాట్లాడుతున్న రెడ్డి శాంతి

హౌస్‌ అరెస్ట్‌ చేయడం దారుణం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి

శ్రీకాకుళం అర్బన్‌ :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రబంద్‌కు పిలుపునిస్తే తెలుగుదేశం ప్రభుత్వం కుట్రపన్ని అర్ధరాత్రి నుంచే హౌస్‌ అరెస్ట్‌లకు పాల్పడటం ప్రజాస్వామ్యంలో చీకటిరోజని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని తన స్వగృహంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రెడ్డి శాంతి మాట్లాడుతూ బంద్‌ విజయవంతమైతే ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి ఉంటుందని భావించిన టీడీపీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలను ముందస్తుగానే హౌస్‌ అరెస్ట్‌ చేయడం దుర్మార్గమన్నారు.

ఐదుకోట్ల ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాను చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. మాట్లాడే హక్కును కూడా టీడీపీ హరించివేయడం శోచనీయమన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. హామీలను విస్మరించి ప్రత్యేక ప్యాకేజీ కోసం పాకులాడడం దుర్మార్గమన్నారు. ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షంగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతుంటే పోలీసులతో అరెస్ట్‌లు చేయించడం తగదన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement