reddy santhi
-
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తాం
-
రైతు నోట్లో మట్టి కొట్టారు
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళాన్ని వ్యవసాయాధారిత జిల్లాగా గుర్తించిన ప్రభుత్వం, ఆఖరుకు జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అంతంత మాత్రంగానే చేసి చేతులు దులిపేసుకున్నారని ఆమె దుయ్యబట్టారు. జిల్లాలో సుమారు 4 లక్షల మందికి పైగా వరి పంట సాగుచేస్తున్న రైతులకు నిరాశే మిగిలిందన్నారు. రైతులంతా సుమారు 2, 41, 155 మెట్రిక్ టన్నల ధాన్యాన్ని పండించారని, ఈ పంటను ఇంటిలో ఉంచుకోలేక, ప్రభుత్వానికి అమ్ముకోలేక దళారులను ఆశ్రయించే పరిస్థితులు తెచ్చారని విమర్శించారు. ధాన్యం కొనుగోలుపై డాంబికాలు పలికిన నేతలు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో ఉదా సీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మరో మారు రైతుద్రోహిగా పేరుపొందారని, టీడీపీ నాయకులకు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయని రెడ్డి శాంతి పేర్కొన్నారు. -
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
కొత్తూరు: మండలంలోని బమ్మిడి గ్రామానికి చెందిన 75 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. గ్రామానికి చెందిన వంబరవిల్లి శ్రీనివాసరావు, ఆర్.శిమ్మయ్య, వైరాగి, ఏ.సంజీవు, ఎస్.కృష్ణమూర్తి, ఏ.శిమ్మన్న, ఎల్.అప్పలనాయుడు, పి.లక్షణరావు తదితరులు ఆదివారం ఆదివారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ప్రజా సమస్యలు, ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సారిపల్లి ప్రజాదరావు, రైతు విభాగం జిల్లా నేత రేగేటి కన్నయ్య, వైద్యులు ఎం.తిరుపతిరావు. సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు
శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు అయినట్లు పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి తెలిపారు. ఈ నెల 21న వంశధార నిర్వాసిత గ్రామాల్లో జగన్ పర్యటించాల్సి ఉంది. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పర్యటన రద్దు అయినట్లు ఆమె చెప్పారు. శ్రీకాకుళంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యే వెంకటరమణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల నుంచి ఎమ్మెల్యే కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. నిర్వాసితులకు అందించే నష్టపరిహారం చెక్కుల్లో ఆయన భారీగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు త్వరలో బయటపెడతామని రెడ్డి శాంతి తెలిపారు. -
మత్స్యకారులపై వివక్ష
ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మండిపాటు డొంకూరు మత్స్యకారులకు ఓదార్పు డొంకూరు(ఇచ్ఛాపురం రూరల్): మత్స్యకారులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన రాయితీలు, భృతి చెల్లించడంలో టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మండిపడ్డారు. శనివారం డొంకూరులో పర్యటించి మత్స్యకారులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని, 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్ మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటించిన హామీలు బంగాళాఖాతంలో కలిసిపోయాయని ఎద్దేవా చేశారు. చేపల వేట విరామ సమయంలో ఇచ్ఛాపురం, కవిటి మండలాలకు చెందిన 1320 మంది మత్స్యకారులకు ఇవ్వాల్సిన భృతి ఇంతవరకు చెల్లించకపోవడంలో ఆంతర్యమేంటని ఆమె ప్రశ్నించారు. జిల్లాలో కనీసం ఒక్క శాసనసభ సీటును కూడా మత్స్యకారులకు కేటాయించలేకపోయిందని దుయ్యబట్టారు. 18 మంది మత్స్యకారుల పెన్షన్ తొలగించడం దారుణమన్నారు. గ్రామానికి రోడ్లు నిర్మించలేదనీ, చేపలను ఎండబెట్టేందుకు ప్లాట్ ఫారాలను, కోల్డ్‌స్టోరేజ్‌లను నిర్మిస్తామంటూ చెప్పిన నేతలు ఇప్పుడు మోహం చాటేస్తున్నారని సర్పంచ్ ప్రతినిధి బుడ్డ జానకిరావు, కాంతారావులు వైఎస్ఆర్ సీపీ నేతల వాపోయారు. మత్స్యకార సమస్యలపై సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు వారంతా తీర్మానించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, జిల్లా అధికార ప్రతినిధి పూడి నేతాజీ, రాష్ట్ర యువత కార్యదర్శి నవీన్ అగర్వాలా, కంచిలి ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, మాజీ ఎంపీపీలు కారంగి మోహనరావు, ఎం.గణపతి, పి.తిలక్, మత్స్యకార ప్రతినిధులు సూరాడ పాపారావు, బుడ్డ కాంతారావు, జానకిరావు, ఇచ్ఛాపురం, సోంపేట మండల కన్వీనర్లు పిట్ట ఆనంద్, తడక జోగారావు, గుమ్మడి రాందాస్ యాదవ్, బతకల భాస్కరరావు, ఆర్.చిట్టిబాబు, ఎస్సీ మండల కన్వీనర్ బాగ మోహనరావు, లోపింటి దుర్యోధన, కృష్ణారెడ్డి, మోహనరావు, రామేశ్వరరావు, పి.ప్రభాకర శేశయ్య పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యంలో చీకటిరోజు
హౌస్ అరెస్ట్ చేయడం దారుణం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి శ్రీకాకుళం అర్బన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్రబంద్‌కు పిలుపునిస్తే తెలుగుదేశం ప్రభుత్వం కుట్రపన్ని అర్ధరాత్రి నుంచే హౌస్ అరెస్ట్‌లకు పాల్పడటం ప్రజాస్వామ్యంలో చీకటిరోజని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని తన స్వగృహంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రెడ్డి శాంతి మాట్లాడుతూ బంద్ విజయవంతమైతే ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి ఉంటుందని భావించిన టీడీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ఐదుకోట్ల ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాను చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. మాట్లాడే హక్కును కూడా టీడీపీ హరించివేయడం శోచనీయమన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. హామీలను విస్మరించి ప్రత్యేక ప్యాకేజీ కోసం పాకులాడడం దుర్మార్గమన్నారు. ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షంగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతుంటే పోలీసులతో అరెస్ట్‌లు చేయించడం తగదన్నారు. -
టీడీపీది ప్రజావ్యతిరేక పాలన
రుణాలు మాఫీ చేయకపోవడంతో నిర్వీర్యమవుతున్న డ్వాక్రా సంఘాలు గిరిజన గ్రామాలకు అందని వైద్యం ప్రత్యేక హోదా సాధించేవరకు వైఎస్సార్ సీపీ పోరాటం పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లవుతున్నా జిల్లాలో అభివృద్ధి జాడ లేదన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, యువత, నిరుద్యోగులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు ఇలా ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. ఉద్యోగం, ఉపాధి లేక జిల్లా వాసులు వలసబాట పడుతున్నా నేతలకు పట్టడంలేదని విమర్శించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోవడంతో వడ్డీలతో అప్పు పెరిగి సంఘాలు నిర్వీర్యమవుతున్నాయని వాపోయారు. మీడియాకు దూరంగా అచ్చెన్న.. నయీంతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మీడియా ప్రశ్నిస్తుందనే భయంతో కలెక్టర్‌ను తన ఇంటికి పిలిపించుకుని సాగునీరు, పవర్‌ప్లాంట్ విషయాలపై చర్చించడం విచారకరమన్నారు. ఇంటిలో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం శోచనీయమన్నారు. విప్, ఎమ్మెల్యేలు, ఎంపీ తదితరులెవ్వరూ లేకుండానే సమావేశం నిర్వహించడంలో ఆంత్యర్యమేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బినామీ పేర్లుతో ఇసుక దోపిడీ.. ఇసుక ఉచితమంటూనే బినామీ పేర్లుతో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారని రెడ్డి శాంతి విమర్శించారు. పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకటరమణ కూడా ఇసుక దోపిడీలో భాగస్వామి అయ్యారన్నారు. దీనికోసమే ఫ్యాన్ గుర్తుపై గెలిచి అధికార పార్టీలోకి మారారన్నారు. గిరిజన గ్రామాల్లో వైద్యసదుపాయాలు కరువయ్యాయన్నారు.ఎల్.ఎన్.పేట మండలం మురుగులోవ గిరిజన గ్రామంలో వైద్య సదుపాయం లేక ఓ గర్భిణి ప్రసవించేందుకు నానా అవస్థలు పడి, చివరకు బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. హోదా సాధించేవరకు పోరాటం రాష్ట్రంలోని ఐదుకోట్ల మంది ఆంధ్రుల మనోభావాలను గుర్తించిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. ‘ప్రత్యేకహోదా– ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో హోదా సాధించేవరకు పోరాటం ఆపేది లేదన్నారు. -
తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించండి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి డిమాండ్ పలాస: టెక్కలి డివిజన్లోని టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజక వర్గాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొని ఉందని, ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. ఆదివారం కాశీబుగ్గ వచ్చిన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నీటి ఎద్దడి నివారణకు జలాశయాలను అభివృద్ధి చేయాలని, ఇందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలన్నారు. ప్రజలకు తాగునీరు సరఫరా సక్రమంగా జరిగితే రోగాల కు దూరంగా ఉంటారన్నారు. సురక్షిత నీరు లభించకపోవడం వల్లే ఉద్దానం ప్రాంతంలో ప్రజలు కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాల్సిన జిల్లా అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని చెప్పారు. జిల్లాలో అధికారుల కొరత కూడా చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. 20 శాఖల్లో అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అధికారులు ఏ కారణంగా దీర్ఘకాలిక సెలవులు పెట్టి వెళ్లిపోతున్నారని ఆమె ప్రశ్నించారు. ఉచిత ఇసుక బూటకం ప్రజలకు ఉచితంగా ఇసుకను ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, అదంతా ఒట్టి బూటకమన్నారు. తెలుగుదేశం నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు వేల కోట్ల రూపాయల ఇసుకును తినేస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక అక్రమ నిల్వలు ఉంచుకొని కృత్రిమ కొరత సృష్టించి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ఆమె ఆరోపించారు. శాసన సభలో ఒక మహిళా ఎమ్మెల్యే అని కనీసం గౌరవించకూండా ఆర్కే రోజాను శాసన సభలోకి అడుగుపెట్టనీయకుండా అడ్డుకుంటున్నారని, ఇది అప్రజాస్వామికమన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జుత్తు జగన్నాయకులు, మాజీ ఎంపీపీ బత్తిన హేమేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్ బోర కృష్ణారావు, రాపాక శేషగిరి, జుత్తు కూర్మారావు, జోగ కృష్ణారావు, గొలుసు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘వంశధార’నిర్వాసితుల పాదయూత్ర
సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ శర్మ హిరమండలం నుంచి కలెక్టరేట్ వరకూ సాగిన యూత్ పోలవరం తరహా ప్యాకేజీకి డిమాండ్ కలెక్టర్‌కు వినతి శ్రీకాకుళం టౌన్: ఏడేళ్ల క్రితం ప్రారంభించిన వంశధార ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇంతవరకూ పరిహారం చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారంటూ సీపీఎం, నిర్వాసిత హక్కుల సాధన సమితి సంయుక్తంగా చేపట్టిన పాదయూత్ర శనివారం కలెక్టరేట్‌కు చేరుకుంది. పాదయూత్రను హిరమండలంలోని కోరాడ సెంటర్లో బుధవారం ప్రారంభించారు. నిర్వాసిత గ్రామాల ప్రజలతో కలిసి సీపీఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి, ఇతర నాయకులు పాదయాత్ర నిర్వహించారు. న్యాయబద్ధంగా నిర్వాసితులకు రావలసిన పరిహారం చెల్లించాలని, పోలవరం తరహాలో పునరావాసం కల్పించాలని, పరిహారం చెల్లించకుండా రిజర్వాయర్ నిర్మాణం పనులు చేపడితే అడ్డుకుంటామని హెచ్చరించారు. యువతకు ప్రకటించిన ప్యాకేజితోపాటు అర్హులైన వారికి ఉద్యాగాలివ్వాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 2గంటలకు శ్రీకాకుళం కొత్తరోడ్డుకు చేరుకున్న పాదయాత్రకు సంఘీభావం ప్రకటిస్తూ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చౌదరి తేజేశ్వరరావు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బలగ, పాలకొండ రోడ్డు, కళింగ రోడ్, పాత బస్టాండ్, పాత శ్రీకాకుళం మీదుగా కలెక్టరేట్ వరకు సాగిన పాదయాత్రలో నిర్వాసితుల సమస్యలతో నినదించారు. డప్పులతో ఊరేగింపుగా కలెక్టరేట్‌కు చేరుకున్న వారంతా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహంను కలిసి వినతిపత్రం అందజేశారు. పాదయాత్రలో నిర్వాసితుల సంఘం నాయకులు జి.సింహాచలం, సీఐటీయూ నాయకులు పంచాది కృష్ణారావు, కె.నారాయణరా వు, మోహనరావు, బొడ్డేపల్లి జనార్దనరావు, బొడ్డేపల్లి మోహనరావు, నిర్వాసితులు పాల్గొన్నారు. పునరావాసం కల్పించాలి: రెడ్డి శాంతి శ్రీకాకుళం అర్బన్: వంశధార రిజర్వాయర్ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పరిహారాన్ని చెల్లించిన తరువాతే రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని, పోలవరం ప్యాకేజీ తరహాలో ఇక్కడ కూడా ప్యాకేజి ప్రకటించాలన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏమీ చేయకుండా నిర్వాసితులకు మద్దతు తెలిపిన నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం శోచనీయమన్నారు. ఇది తప్పుడు విధానమని, రానున్న బడ్టెట్‌లో వంశధార నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి వారిని ఆదుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
ఆదరించండి.. ఓటేయండి...
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: సంక్షేమానికి చిరునామాగా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు వచ్చిన జగన్మోహన్రెడ్డిని ఆదరించాలని, ప్రస్తుత ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ, శాసనసభ సమన్వయకర్తలు రెడ్డి శాంతి, ధర్మాన ప్రసాదరావు కోరారు. శ్రీకాకుళంలోని ఎనిమిదో వార్డులోని భద్రమ్మగుడి, ఇల్లీసుపురం కూడలి, పాత ఎంప్లాయిమెంట్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం వారు ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరిగి వైఎస్సార్సీపీ ఆశయాలు, సిద్ధాంతాలు వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్రెడ్డిని సీఎంను చేయాలని కోరారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారని చెప్పారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎందరో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్న అమ్మ ఒడి పథకం ద్వారా వేలాది మంది పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల పిల్లలు ఉన్నత విద్యనభ్యసిం చేందుకు అవకాశం కలుగుతుందన్నారు. పిల్లల తల్లులకు కూడా లబ్ధి కలుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎంవీ పద్మావతి, చల్లా అలివేలు మంగ, అంధవరపు సూరి బాబు, జేఎం శ్రీనివాస్, అబ్దుల్ రెహ్మాన్, టి.కామేశ్వరి, మండవిల్లి రవి, కె.ఎల్.ప్రసాద్, శిమ్మ వెంకట్రావు, పైడి నిర్మల్‌కుమార్, గుడ్ల మల్లేశ్వరరావు, చల్లా మంజుల, టి.మోహిని, మహమ్మద్ సిరాజుద్దీన్, రావాడ జోగినాయుడు, శ్రీనివాస్ పట్నాయక్, కూన వాసుదేవరావు, స్థానికులు బాలు, హారికాప్రసాద్, గజ్జల లీలావతి, బొడ్డేపల్లి భాస్కరరావు, వై.మురళీమోహన్ పాల్గొన్నారు. -
జగన్‌తోనే సంక్షేమం సాధ్యం
శ్రీకాకుళం రూరల్, న్యూస్‌లైన్ : జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు రెడ్డి శాంతి, ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం సాయంత్రం పొన్నాంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ, పిల్లల ఉన్నత చదువులు, అర్హులకు పింఛన్లు అందాలంటే వైఎస్సార్సీపీకి ఓటేయాలన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మండలం నుంచి పోటీ చేస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు చిట్టి జనార్థనరావు, నీలంశెట్టి సౌమ్యను గెలిపించాలని కోరారు. బాబు సంక్షేమమేమిటంటే... ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కడమే చంద్రబాబు మార్కు సంక్షేమమని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. ప్రజాదరణతో గద్దెనెక్కిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దె దించిన ఘనత బాబుదన్నారు. రెండు రూపాయల కిలో బియ్యాన్ని రూ.5.25కు పెంచడం, మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి గ్రామగ్రామాన బెల్టు షాపుల ఏర్పాటు చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలన్నారు. ప్రస్తుతం ఇస్తున్న హామీలను తొమ్మిదేళ్ల పాలనలో ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు చిట్టి జనార్ధనరావు, నీలంశెట్టి సౌమ్య, గ్రామ సర్పంచ్ బైరి రాజేశ్వరీరామారావు, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, మాజీ జెడ్పీ చైర్మన్ వైవీ సూర్యనారాయణ, మాజీ ఎంపీపీ అంబటి శ్రీనివాసరావు, కొర్ను గోవిందరావు, నీలంశేట్టి రామకృష్ణ, మొదలవలస శ్రీనివాసరావు, సనపల శ్రీనివాసరావు, రావాడ ధరణీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పే నేతలను తరిమికొట్టాలి ఆమదాలవలస : కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్, టీడీపీ నేతలను తరిమికొట్టాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాంతో కలిసి మున్సిపాలిటీపరిధిలోని 22వ వార్డు లక్ష్ముడిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిని సీఎంను చేస్తే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు. ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి బి.అజంతాకుమరి, కౌన్సిలర్ అభ్యర్థి దుంపల చిరంజీవి, పార్టీనాయకులు అందవరపు సూరిబాబు, రవికుమార్, కూన ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సరోజనమ్మకు ఓటేయండి మండలంలోని నెల్లిపర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రెడ్డి శాంతి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బొడ్డేపల్లి సరోజనమ్మకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఎస్.అనిల్‌కుమార్, పార్టీ నాయకులు ఎస్.సీతారాం, కేవీ రమణ, జి.గిరి, తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి మార్గం వైఎస్సార్సీపీ
పలాస, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడమే అభివృద్ధికి మార్గమని ఆ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలాస కాశీబుగ్గ మున్సిపాల్టీ పరిధిలోని 17వ వార్డులో పురుషోత్తపురంలో సోమవారం ఆమె ప్రసంగించారు. జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పలాస శాసనసభ్యుడు జుత్తు జగన్నాయకులు మాట్లాడుతూ పలాస కాశీబుగ్గమున్సిపాల్టీకి, వైఎస్ కుటుంబానికి సంబంధం ఉందన్నారు. ప్రతి ఎన్నికలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డికి పలాస ఒక సెంటిమెంటన్నారు. వైఎస్సార్ సీపీ పలాస నియోజకవర్గం సమన్వయకర్త వజ్జ బాబూరావు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్‌గా తాను చేసిన అభివృద్ధిని గుర్తించి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 17వ వార్డు నుంచి పోటీ చేస్తున్న బళ్ల ఉషను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకుడు కొయ్యి ప్రసాదరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ 17వ వార్డు అభ్యర్థి బళ్ల ఉష, మాజీ కౌన్సిలర్లు వజ్జ గంగాభవానీ, బళ్ల గిరిబాబు, స్థానిక నాయకులు బద్రి గోపాలరావు, మల్లా రాజారావు, కొరికాన ఫాల్గుణరావు, బద్రి మోహన్‌రావు, తాళాసు ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.