సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ శర్మ హిరమండలం నుంచి కలెక్టరేట్ వరకూ సాగిన యూత్ పోలవరం తరహా ప్యాకేజీకి డిమాండ్ కలెక్టర్‌కు వినతి
శ్రీకాకుళం టౌన్: ఏడేళ్ల క్రితం ప్రారంభించిన వంశధార ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇంతవరకూ పరిహారం చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారంటూ సీపీఎం, నిర్వాసిత హక్కుల సాధన సమితి సంయుక్తంగా చేపట్టిన పాదయూత్ర శనివారం కలెక్టరేట్‌కు చేరుకుంది. పాదయూత్రను హిరమండలంలోని కోరాడ సెంటర్‌లో బుధవారం ప్రారంభించారు. నిర్వాసిత గ్రామాల ప్రజలతో కలిసి సీపీఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి, ఇతర నాయకులు పాదయాత్ర నిర్వహించారు. న్యాయబద్ధంగా నిర్వాసితులకు రావలసిన పరిహారం చెల్లించాలని, పోలవరం తరహాలో పునరావాసం కల్పించాలని, పరిహారం చెల్లించకుండా రిజర్వాయర్ నిర్మాణం పనులు చేపడితే అడ్డుకుంటామని హెచ్చరించారు. యువతకు ప్రకటించిన ప్యాకేజితోపాటు అర్హులైన వారికి ఉద్యాగాలివ్వాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 2గంటలకు శ్రీకాకుళం కొత్తరోడ్డుకు చేరుకున్న పాదయాత్రకు సంఘీభావం ప్రకటిస్తూ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చౌదరి తేజేశ్వరరావు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బలగ, పాలకొండ రోడ్డు, కళింగ రోడ్, పాత బస్టాండ్, పాత శ్రీకాకుళం మీదుగా కలెక్టరేట్ వరకు సాగిన పాదయాత్రలో నిర్వాసితుల సమస్యలతో నినదించారు. డప్పులతో ఊరేగింపుగా కలెక్టరేట్‌కు చేరుకున్న వారంతా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహంను కలిసి వినతిపత్రం అందజేశారు. పాదయాత్రలో నిర్వాసితుల సంఘం నాయకులు జి.సింహాచలం, సీఐటీయూ నాయకులు పంచాది కృష్ణారావు, కె.నారాయణరా వు, మోహనరావు, బొడ్డేపల్లి జనార్దనరావు, బొడ్డేపల్లి మోహనరావు, నిర్వాసితులు పాల్గొన్నారు.
పునరావాసం కల్పించాలి: రెడ్డి శాంతి
శ్రీకాకుళం అర్బన్: వంశధార రిజర్వాయర్ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పరిహారాన్ని చెల్లించిన తరువాతే రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని, పోలవరం ప్యాకేజీ తరహాలో ఇక్కడ కూడా ప్యాకేజి ప్రకటించాలన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏమీ చేయకుండా నిర్వాసితులకు మద్దతు తెలిపిన నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం శోచనీయమన్నారు. ఇది తప్పుడు విధానమని, రానున్న బడ్టెట్‌లో వంశధార నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి వారిని ఆదుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.
‘వంశధార’ నిర్వాసితుల పాదయూత్ర
Published Sun, Feb 7 2016 5:04 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement