రైతాంగాన్ని ఆదుకోకుంటే ఆందోళనే | jangareddy on farmers issue | Sakshi
Sakshi News home page

రైతాంగాన్ని ఆదుకోకుంటే ఆందోళనే

Published Sat, Feb 25 2017 11:05 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

రైతాంగాన్ని ఆదుకోకుంటే ఆందోళనే - Sakshi

రైతాంగాన్ని ఆదుకోకుంటే ఆందోళనే

కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది, తక్షణమే ప్రభుత్వం ఆదుకోకపోతే ఆందోళన తప్పదని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.జంగారెడ్డి పేర్కొన్నారు.

రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగారెడ్డి
యాచారం: కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది, తక్షణమే ప్రభుత్వం ఆదుకోకపోతే ఆందోళన తప్పదని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.జంగారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం మండల రైతు సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ... తాగునీరు, పశుగ్రాసం లేక మూగజీవాలను కాపాడుకోవడం కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. అప్పులు చేయడం, నగలు తాకట్టు పెట్టడం, సంతలో పశువులను కబేళాలలకు విక్రయాలు జరపడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు ఉచితంగా పశుగ్రాసం సరఫరా చేసి తాగునీటి సౌకర్యాం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఫార్మాకు భూసేకరణ చేస్తున్న యాచారం, కడ్తాల్, ఆమన్ గల్‌ మండలాల్లో రైతుల అంగీకారం మేరకే భూసేకరణ చేసి 2013 చట్టం మేరకే పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రైతుల మద్దతుగా ఆందోళనలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా కార్యదర్శి బి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాదా బైనామాలను ఎలాంటి షరతులు లేకుండా అరు్హలైన పేద రైతులకు సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. పాల ఉత్పత్తిపై ఆధారపడిన రైతులకు తక్షణమే పాల ధర పెంచి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి తావునాయక్,  మండల కమిటీ సభ్యు లు చంద్రయ్య, జంగారెడ్డి, కిష్ణరెడ్డి, శ్రీశైలం,బాషయ్య, మైసయ్య, సత్తయ్య  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement