
న్యాయమూర్తుల స్వచ్ఛభారత్
కదిరి :
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పుర స్కరించుకుని శనివారం అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో న్యాయమూర్తులు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. చీపుర్లు చేతబట్టి కోర్టు భవనంతో పాటు ప్రాంగణం శుభ్రపరిచారు. వ్యతిగత పరిశుభ్రతే కాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎస్‌ఎండీ ఫజులుల్లా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.వాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.ఆదినారాయణ అన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగాల లోకేశ్వర్‌రెడ్డి, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.