గుడాటిపల్లి భూ నిర్వాసితుల దీక్షలో మాట్లాడుతున్న రాంగోపాల్‌రెడ్డి
-
సీపీఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి
హుస్నాబాద్‌రూరల్ : గండిపెల్లి, గౌరవెల్లి ప్రాజెక్టుల భూనిర్వాసితులకు న్యాయం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి కోరారు. గుడాటిపల్లిలో భూనిర్వాసితులు చేపట్టిన దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేపట్టాలని కోరారు. 123 జీవోను వెనక్కితీసుకోవాలన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం దక్కే వరకు వారి తరఫను పోరాడుతామన్నారు. న్యాయమైన పరిహారం కోసం సోమవారం కలెక్టరేట్ ముట్టడించనున్నట్లు తెలిపారు. దీక్షలో మద్దెల సరోజ, గొట్టెముక్కల సరోజ, మిట్టపల్లి లక్ష్మి, గుర్రం పద్మ, సింగిరెడ్డి సుజాత కుర్చున్నారు. సీపీఐ మండల కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, అశోక్, తదితరులు మద్దతు తెలిపారు.