దిగువ అహోబిలం చేరుకున్న జ్వాలా నరసింహుడు
అహోబిలం (ఆళ్లగడ్డ): పారువేట ఉత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో వెలసిన జ్వాలనరసింహ స్వామి శనివాం దిగువ అహోబిలం చేరుకున్నారు. తన వివాహ మహోత్సవ వేడుకలకు భక్తులను ఆహ్వానించేందుకు ఉత్సవ పల్లకిలో కొలువై నల్లమల అడవి మార్గంలో గ్రామాల మీదుగా దిగువ అహోబిలం తీసుకువచ్చారు. దిగువ అహోబిలం చేరుకుంటున్న సమయంలో పొలిమేరల్లో ఆలయ అర్చకులు, వేద పండితులు భాజా భజంత్రీలతో ఎదురేగి స్వామికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తూ దిగువ అహోబిలంలోని మఠంలోకి తీసుకెళ్లారు.