హార్సిలీహిల్స్‌లో కన్నడ చిత్రం లీ షూటింగ్ | kannada movie lee shooting in horsley hills | Sakshi
Sakshi News home page

హార్సిలీహిల్స్‌లో కన్నడ చిత్రం లీ షూటింగ్

Published Sat, Jul 16 2016 10:56 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

హార్సిలీహిల్స్‌లో కన్నడ చిత్రం లీ షూటింగ్

హార్సిలీహిల్స్‌లో కన్నడ చిత్రం లీ షూటింగ్

* గాలిబండపై ద్రోణ్ ద్వారా సన్నివేశాల చిత్రీకరణ          
* చిత్ర దర్శకుడు మదనపల్లె యువకుడు

బి.కొత్తకోట: కన్నడ చిత్రం లీ సినిమా షూటింగ్ శుక్రవారం బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో జరిగింది. ఇక్కడి ప్రకృతి రమణీయ దృశ్యాలకు కేంద్రమైన గాలిబండపై చిత్ర హీరో హీరోయిన్లపై ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించారు.  కాగా గాలిబండ అంచులో హీరోయిన్ నబా నటేష్ నిలబడివున్న సన్నివేశాన్ని కెమెరాతో ఎదురుగా చిత్రీకరించే వీలులేకపోవడంతో దర్శకులు శ్రీనందన్ ద్రోణ్‌ను వినియోగించారు. హీరోయిన్ వైపు నుంచి ద్రోణ్ ఎదురుగా ఉన్న లోతైన లోయపై నుంచి సుందరమైన దృశ్యాలను చిత్రీంచింది.  షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకొన్న పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చారు. మదనపల్లె రేంజర్ మాధవరావు, సిబ్బంది కూడా షూటింగ్ తిలకించారు.
 
రెండు మతాల మధ్య ప్రేమకథ
లీ చిత్రం పూర్తిగా యాక్షన్, ప్రేమ కథనంతో నడుస్తుందని చిత్ర దర్శకుడు హెచ్‌ఎం. శ్రీనందన్ చెప్పారు. మదనపల్లెకు చెందిన శ్రీనందన్‌కు దర్శకుడిగా ఇది రెండో చిత్రం. ఈ సినిమాకు నిర్మాత సాధు రమేష్, సంగీతం గురుకిరణ్‌కాగా ప్రముఖ విలన్ పాత్రధారి రాహుల్‌దేవ్‌ది కీలక పాత్రని చెప్పారు. రంగయ్యరఘు, సాధుకోకిల, చిన్నక్క, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement